Ambulance accident: అదుపు త‌ప్పి టోల్‌ బూత్‌ని ఢీ కొట్టిన అంబులెన్స్‌.. రోగితో స‌హా న‌లుగురి మృతి..  

Published : Jul 20, 2022, 08:18 PM ISTUpdated : Jul 20, 2022, 08:33 PM IST
Ambulance accident: అదుపు త‌ప్పి టోల్‌ బూత్‌ని ఢీ కొట్టిన అంబులెన్స్‌.. రోగితో స‌హా న‌లుగురి మృతి..  

సారాంశం

Ambulance accident: అదుపు త‌ప్పి టోల్‌ బూత్‌ని ఓ అంబులెన్స్ ఢి కొట్టింది. ఆ ప్ర‌మాదంలో అంబులెన్స్ లో ఉన్న పేషంట్ తోపాటు మ‌రో ముగ్గురు మరణించిన‌ట్టు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌మాదానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ మారింది.  

Ambulance accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉడిపి జిల్లాలో ఓ  అంబులెన్స్‌ అదుపు తప్పి టోల్‌ బూత్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌ డ్రైవర్‌ సహా రోగి, ఇద్దరు అటెండర్లు  మరణించారు. ప‌లువురికి తీవ్ర‌ గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న ఉడిపి జిల్లా కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. కర్నాటకలోని ప‌లు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ అస్థ‌వ్య‌స్థంగా మారాయి. వర్షపు నీరు కారణంగా.. అతివేగంగా వెళ్తున్న‌ అంబులెన్స్‌ అదుపుతప్పి టోల్ బూత్‌ని ఢీకొట్టినట్టు  సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్ర‌స్తుత‌రం ఆ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

ఈ వీడియోలో వ‌ర్షం కురుస్తుండ‌గా..  ఓ అంబులెన్స్ వేగంగా వస్తుంది. అంబులెన్స్ సైర‌న్ విన్న టోల్ గేట్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. పరిగెత్తుకుంటూ.. వ‌చ్చి అడ్డంగా ఉన్న బారికేట్ల‌ను తొల‌గించారు. కానీ, అతివేగంగా దూసుకు వ‌స్తున్న‌ అంబులెన్స్‌ అదుపుతప్పి.. టోల్‌ బూత్‌ని బ‌లంగా ఢీ కొట్టింది. అంబులెన్స్ బోల్తా పడింది. ఈ క్ర‌మంలో అంబులెన్స్‌లో ఉన్న వస్తువులు అన్ని చెల్లాచెదురుగా బయట పడ్డాయి. అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. ప్ర‌మాదం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ ఒళ్లు గగ్గుర్పొడిచేలా కనిపించిన ఈ ఆక్సిడెంట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?