సిద్ధూ మూసేవాలా హత్య కేసులో షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా అరెస్ట్..

Published : Jul 05, 2022, 07:40 AM ISTUpdated : Jul 05, 2022, 07:41 AM IST
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో షార్ప్ షూటర్ అంకిత్ శిర్సా అరెస్ట్..

సారాంశం

ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో ఓ షార్ప్ షూటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర బయటపడిన వీడియోలో కీలక సమాచారం ఉంది. 

పంజాబ్ : పంజాబీ గాయకుడు సిద్దు మూసే వాలా హత్య కేసులో కీలక షార్ప్ షూటర్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో మూసేవాలా హత్య కేసులో మరింత పురోగతి సాధించినట్లు అయ్యింది. మూసేవాలాపై కాల్పులు జరిపిన నలుగురిలో అంకిత్ శిర్సా కీలకమైన వ్యక్తి.  అతడిని ఢిల్లీలోని కశ్మీరగేట్ బస్టాండ్ దగ్గర అరెస్టు చేశారు. అతడితో పాటు మరికొందరు షూటర్లకు ఆశ్రయమిచ్చిన సచిన్ భివానీ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ స్పెషల్ కమిషనర్ హర్ గోబింధర్ దాల్ వాల్ పేర్కొన్నారు. మూసేవాలా హత్యలో పాల్గొన్న  షూటర్ లలో ankit  చిన్నవాడు. 

అతడు sonipatలో ఉంటాడు. అంకిత్ పై ఇప్పటికే రాజస్థాన్ లో రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఇక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రాజస్థాన్లో కార్యకలాపాలను సచిన్ పర్యవేక్షిస్తున్నాడు. షూటర్లు అంతమందికి అతడే ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. నిందితుల నుంచి ఒక 9ఎంఎం బోర్ బిస్టోల్, 10 లైవ్ కార్టరిడ్జ్ లు, 0.30 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పంజాబ్ పోలీసుల యూనిఫాం, 2 మొబైల్, ఒక సిమ్, ఒక డాంగిల్ కూడా దొరికాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గుట్టల కొద్దీ ఆయుధాలు దొరుకుతున్నాయి.  

Sidhu Moose Wala Murder Case: హ‌త్య అనంత‌రం.. కారులో.. జ‌ల్సా చేసిన హంత‌కులు.. కీల‌క వీడియో వెలుగులోకి..

గత నెల జూన్లో అరెస్ట్ లు జరిగిన సమయంలో 8 గ్రనేడ్ లు, 9 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, మూడు పిస్తోళ్లు,  ఒక రైఫిల్ లను స్వాధీనం చేసుకున్నారు. మే 29వ తేదీన శుభ్ దీప్ సింగ్ సిద్దూ అలియాస్ సిద్దూ మూసేవాల మీద జరిస్వగ్రామంలో దుండగులు కాల్చిచంపారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ప్రియవ్రత్ ఫౌజీ, కషీష్,  కేశవకుమార్ లను  అరెస్ట్ చేశారు.  కెనడాకు చెందిన డాన్ గోల్డీ బ్రార్  ఈ హత్యకు బాధ్యత తీసుకున్నాడు. ఇతడు కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి అత్యంత సన్నిహితుడు. 

ఇదిలా ఉండగా, సిద్దు మూసేవాలా హత్య కేసులో సోమవారం మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. సింగర్ హత్య తర్వాత  హంతకులు తుపాకులు ఊపుతూ  కార్  సంబరాలు చేసుకున్నారు.  దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఐదుగురు నిందితులు కనిపిస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ లో పంజాబీ సంగీతం ప్లే అవుతుంది.  అందరూ నవ్వుతూ,  కెమెరా ప్రదర్శిస్తూ  కనిపించారు. ఈ వీడియోలో కారు నడుపుతున్న వ్యక్తిని  కపిల్ పండిట్ గా, అతని పక్క సీట్లో కూర్చో కూర్చున్న వ్యక్తి ప్రియవ్రత ఫౌజీగా గుర్తించారు. 

వెనక సీట్లో కూర్చున్న వ్యక్తులను సచిన్ భివాని, అంకిత్ సిర్సాలుగా గుర్తించారు.దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కాల్పులు జరిపిన వారిలో పిన్న వయస్కుడైన అంకిత్ శిర్సాను  ఆదివారం రాత్రి ఢిల్లీలోని బస్ టెర్మినల్ వద్ద అరెస్టు చేశారు. అతని అరెస్టు తర్వాత.. అతని ఫోను పరిశీలించగా పోలీసులకు హత్యకు సంబంధించిన రెండు వీడియోలు అందులో కనిపించాయి.  

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..