పోలీసులు నన్ను ఎన్ కౌంటర్ చేస్తారు.. కాపాడండి.. కోర్టు మెట్లెక్కిన గ్యాంగ్ స్టర్ లారెన్స్..

Published : May 31, 2022, 07:09 AM IST
పోలీసులు నన్ను ఎన్ కౌంటర్ చేస్తారు.. కాపాడండి.. కోర్టు మెట్లెక్కిన గ్యాంగ్ స్టర్ లారెన్స్..

సారాంశం

సింగర్ సిద్దూ మూసే వాలా హత్య కేసులో తన  ప్రమేయం లేదని లారెన్స్ బిష్ణోయ్ కోర్టు మెట్లెక్కాడు. తనను పోలీసులకు అప్పగించవద్దని.. అలా చేస్తే తనను ఎన్ కౌంటర్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఢిల్లీ : ప్రముఖ పంజాబీ గాయకుడు sidhu moose wala హత్య తమ పనేనని కెనడాలో నివసిస్తున్న గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించిన విషయం తెలిసిందే.  గ్యాంగ్స్టర్ 
Lawrence Bishnoiతో కలిసి తాము ఈ కుట్ర పన్నినట్లు పేర్కొన్నాడు. అయితే Goldy Brar వ్యాఖ్యలను లారెన్స్ బిష్ణోయ్ కొట్టిపారేశాడు. ఈ murderలో తన ప్రమేయం లేదని పేర్కొన్నాడు. పలు కేసులు తిహాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్... తనను కాపాడాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. విచారణ కోసం తనను పోలీసులకు అప్పగించవద్దు అని patiala న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. 

ఒకవేళ అప్పగిస్తే పోలీసులు తనను నకిలీ ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాడు. గోల్డీ ఆరోపణలను ఖండిస్తూ ఇంతటి భారీ హత్యకు కుట్రను జైలులో నుంచి ఎలా ప్లాన్ చేస్తారని లారెన్స్ తరపున పిటిషన్ వేసిన న్యాయవాది ప్రశ్నించారు. లారెన్స్ బిష్ణోయ్ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు. బిష్ణోయ్ కి గోల్డీ బ్రార్ అత్యంత సన్నిహితుడు. వీరు పంజాబ్ లో వసూళ్ల దందా నడుపుతూ ఉండేవారు. దేశరాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో లారెన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. కాగా పలు కేసుల్లో లారెన్స్ అరెస్ట్ అయ్యి తీహాడ్ జైల్లో ఉన్నాడు. అనంతరం కెనడాకు పారిపోయిన గోల్డీ బ్రార్ అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ గొడవలు, హత్యల కారణంగానే తాజాగా సిద్దు మూసేవాలా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, సోమవారం నాడు ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలాను తామే హతమార్చామని కెనడాకు చెందిన ఓ గ్యాంగ్ స్టర్ ముఠా వెల్లడించింది. వాంటెడ్ క్రిమినల్ గోల్డీబ్రార్ ఈ హత్య చేశానని ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అకాలీదళ్ నేత హత్య విచారణలో ఈ సింగర్ సిద్దూ మూస్ వాలా పేరు వచ్చిందని.. కానీ పోలీసులు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోల్డీబ్రార్ పేరిట ప్రచారం అవుతున్న ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే వాదనలు వచ్చాయి.

లారెన్స్ బిష్ణోయ్ గ్రూపుకు చెందిన సచిన్ బిష్ణోయ్ దట్టరన్వాలితో కలిసి తానే ఈ హత్య చేసినట్లు గోల్డీబ్రార్ పేర్కొన్నారు. సిద్దు moose wala పేరు విక్కీ మిద్దుఖేరా, గుర్లాల్ బ్రార్ హత్యకు సంబంధించి బయటకు వచ్చిందని, కానీ పోలీసులు ఆయనపై ఏం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. గోల్డ్ అసలు పేరు సతీందర్ సింగ్.. ఈయన లారెన్స్ బిష్ణోయ్ కు  సన్నిహితుడిగా చెబుతారు. బ్రార్ పై చాలా కేసులు ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుర్లాల్ సింగ్ పెహెల్వాన్ హత్య కేసులో బ్రార్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఫరీద్ పూర్ కోర్టు ఇదే నెలలో జారీ చేసిది. 

ఇది ఇలా ఉండగా, సిద్దూ హత్య కేసు వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నదని పంజాబ్ పోలీసు చీఫ్ వీకే భావ్రా ఆదివారం వెల్లడించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన లక్కీ అనే ముఠా సభ్యుడు కెనడా నుంచి బాధ్యత తీసుకున్నారని వివరించారు. గత ఏడాది విక్కీ మిద్దుఖేరా హత్యలో సిద్దూ మూస్ వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ పేరు వచ్చినట్టు పేర్కొన్నారు. విక్కీ మిద్దుఖేరా యూత్ అకాలీ దల్ నేత. ఆగస్టు 2021లో మొహాలిలో హత్య జరిగింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !