పాక్ వెళ్తే తప్పేంటి..? సమర్థించుకున్న సిద్ధు

First Published 21, Aug 2018, 2:53 PM IST
Highlights

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ కూడా లాహోర్ వెళ్లిన విషయాన్ని సిద్ధు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

తన స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారం కోసం పాకిస్థాన్ వెళ్లడాన్ని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ సమర్థించుకున్నారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. తనకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజే స్వయంగా ఫోన్ చేసి పాక్ వెళ్లడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు చెప్పారని సిద్ధూ వెల్లడించారు. 

తనకు పదిసార్లు ఆహ్వానం అందిందని.. అయితే తాను భారత ప్రభుత్వ అనుమతి కోరినట్లు వివరించారు.  కానీ తనకు అనుమతి వెంటనే లభించలేదని గుర్తు చేశారు.  పాకిస్థాన్ వీసా జారీ చేసిన రెండు రోజుల తర్వాత సుష్మా స్వరాజ్ స్వయంగా తనకు కాల్ చేసి అనుమతి లభించినట్లు చెప్పారని ఆయన అన్నారు.  

అంతేకాకుండా గతంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ కూడా లాహోర్ వెళ్లిన విషయాన్ని సిద్ధు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ ను ఆలింగనం చేసుకున్న విషయం గురించి మాట్లాడుతూ.. అది ఆలోచించి చేసినది కాదని.. ఎమోషనల్ గా జరిగిపోయిందన్నారు. 

 

ఇవి కూడా చదవండి..

సిద్ధూ తల తెస్తే రూ. 5 లక్షల బహుమతి

ఇమ్రాన్ ప్రమాణస్వీకారం.. సిద్ధు ఎక్కడ కూర్చున్నాడంటే...

Last Updated 9, Sep 2018, 12:35 PM IST