వార్నీ... లంచం తీసుకుంటూ పట్టుబడిన పోలీసు..ఆధారాలు దొరకొద్దని ఏకంగా నోట్లనే మింగేశాడు..

By SumaBala BukkaFirst Published Dec 14, 2022, 6:50 AM IST
Highlights

ఓ పోలీసు లంచం తీసుకున్నాడు. అది తెలిసి విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. వారికి దొరకొద్దని ఆ లంచం డబ్బులు మింగేశాడు. సినిమాను తలపించే ఈ సీన్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది.

హర్యానా : గేదెల చోరీ కేసులో లంచం తీసుకుంటున్న ఓ పోలీసును హర్యానాలోని ఫరీదాబాద్‌లో విజిలెన్స్ అధికారుల బృందం పట్టుకుంది. అయితే, ఆ అధికారి తాను విజిలెన్స్ కు పట్టుబడొద్దని సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. దీనికోసం అతను చేసిన వారిని 
షాక్ కు గురిచేసింది. ఇంతకీ ఏం చేశాడంటే.. సబ్-ఇన్‌స్పెక్టర్ మహేంద్ర ఉలా లంచంగా తీసుకున్న కరెన్సీ నోట్లను మింగేందుకు ప్రయత్నించాడు. దీంతో విజిలెన్స్ విభాగం అధికారులు అతనిపై బలం ప్రయోగించి ఎట్టకేలకు ఆ ప్రయత్నం విరమించేలా చేశారు. 

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియోలో పోలీసులు అతని ని గట్టిగా పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది.  ఒక అధికారి అతని నోట్లో  రికవరీ చేయడానికి ప్రయత్నించాడు. దీనికి ఆ సబ్ ఇన్స్పెక్టర్  గట్టిగా ప్రతిఘటించాడు.  చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరు  కలగ చేసుకోవడానికి ప్రయత్నించగా… విజిలెన్స్ అధికారి వారిని నెట్టేశారు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది. ఇంతకీ అతను తీసుకున్న లంచం ఎంత అంటే పదివేల రూపాయలు.  

బావిలో దూకినా.. గర్ల్‌ఫ్రెండ్ అయితే దక్కింది.. ఆమెతోనే పెళ్లి చేసిన ఊరిపెద్దలు.. లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్

అది ఒక  గేదెల దొంగతనం కేసులో.. తన గేదె దొంగిలించబడిందని శుభనాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడానికి రాగా..  వెతికి పెట్టాలంటే రూ.10,000 ఖర్చు అవుతుందని  ఫరీదాబాద్ ఎస్సై  మహేంద్ర ఉలా లంచం డిమాండ్ చేశాడు. శుభనాథ్ ఇప్పటికే రూ.6వేలు ఇచ్చేశాడు.. మరో నాలుగు వేలు ఇస్తేనే కేసును టేకప్ చేస్తానని మహేంద్ర ఊలా  చెప్పేసాడు. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేసిన శుభ నాథ్ డబ్బులు ఇస్తుండగా విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో అతడిని హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో షాక్ అయిన ఎస్ ఐ.. డబ్బులు మింగడానికి ప్రయత్నించాడు. 

దీనివల్ల ఆధారాలు లేకుండా చేయాలని భావించాడు. అది గమనించిన విజిలెన్స్ అధికారులు అతడిని రోడ్డుపై పడుకోబెట్టి, నోట్లో చెయ్యి పెట్టి డబ్బులు తీసేందుకు ప్రయత్నించారు.  అయితే అప్పటికే అతను ఆ డబ్బులను మింగేశాడు. అదంతా చూస్తున్న మరో వ్యక్తి  ఎస్ఐపై చేయి చేసుకున్నాడు.  దీంతో విజిలెన్స్ అధికారులు అతడిని అలాగే అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఎస్ఐని తమతోపాటు తీసుకెళ్లారు. అయితే దీన్ని అంతా చుట్టూ ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. 

 

⁦⁦⁩ cop caught red handed taking bribe at Faridabad. swallows bribe money ⁦⁩ pic.twitter.com/bjEYYrr4LQ

— Sushil Manav (@sushilmanav)
click me!