వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేజస్వి యాదవ్ నాయ‌క‌త్వంలో కలిసి నడుస్తాం.. : బీహార్ సీఎం నితీష్‌ కుమార్

By Mahesh RajamoniFirst Published Dec 14, 2022, 1:18 AM IST
Highlights

Patna: భవిష్యత్తులో యువ తరం నాయకుడు తేజస్వి యాదవ్ ను ప్రోత్సహించాలని తాను భావిస్తున్నట్లు నితీష్ కుమార్ గతంలో బహిరంగంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేజస్వి యాదవ్ నాయ‌క‌త్వంలో కలిసి నడుస్తామని చెప్పారు. 
 

Bihar Grand Alliance: 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలో మహాఘట్బంధన్ పోటీ చేస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం చెప్పారు. భవిష్యత్తులో యువ తరం నాయకుడు తేజస్వి యాదవ్ ను ప్రోత్సహించాలని తాను భావిస్తున్నట్లు నితీష్ కుమార్ గతంలో బహిరంగంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన మరోసారి అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తేజస్వి యాదవ్ నాయ‌క‌త్వంలో కలిసి నడుస్తామని చెప్పారు. 

వివరాల్లోకెళ్తే.. బీహార్ అసెంబ్లీలో మహాఘట్బంధన్ నాయకుల సమావేశం తరువాత నితీష్ కుమార్ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్భందన్ కలిపి పోటీ చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో తేజస్వి యాదవ్, జితన్ రామ్ మాంఝీ, అజిత్ శర్మ, మహబూబ్ ఆలం, ఇతర మహాకూటమి నాయకులు పాల్గొన్నారు. "దేశానికి ప్రధాని కావాలనే ఆశయం నాకు లేదు. బీజేపీని ఓడించడం, దాన్ని కేంద్రం నుంచి తొలగించడమే నా ఏకైక ఆశయం. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నాయకత్వంలో పోటీ చేస్తాం" అని నితీష్ కుమార్ తెలిపారు. తాను బీహార్, బీహారీ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్నాననీ, ఇప్పుడు తేజస్వి యాదవ్ భవిష్యత్తులో మంచి పనులను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో యువ తరం నాయకుడు తేజస్వి యాదవ్ ను ప్రోత్సహించాలని తాను భావిస్తున్నట్లు నితీష్ కుమార్ గతంలో బహిరంగంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. నితీష్ కుమార్ కు కేంద్ర స్థాయి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భారత ప్రధాని కావడానికి నితీష్ కుమార్ కు అన్ని అర్హతలు ఉన్నాయని జేడీయూ, ఆర్జేడీ పార్టీల నాయకులు కూడా పేర్కొన్నారు. ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్, జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుష్వాహాలు నితీష్ కుమార్ ప్రధాని మెటీరియల్ అని పేర్కొన్నారు. మరోవైపు, తనకు ప్రధాని కావాలనే కోరిక లేదని నితీష్ కుమార్ చెప్పారు. కుర్హానీ ఉప ఎన్నికల ఫలితాల తరువాత నితీష్ కుమార్ ఈ ప్రకటన చేశారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో పార్టీ అధికారులు, మద్దతుదారులతో బహిరంగ సమావేశం నిర్వహించి ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై చర్చించారు. కుర్హానీలో జేడీయూ పనితీరు పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించడంతో పార్టీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి.

"బీహార్ లో తేజస్వీ యాదవ్ ప్రజాదరణ పెరుగుతోంది. బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీహార్ నాయకత్వం యువతరం చేతుల్లో ఉంది" అని ఆర్జేడీ ఎమ్మెల్యే రాకేశ్ రౌషన్ అన్నారు. 'ముఖ్యమంత్రి ప్రకటన ఎంతో ప్రశంసనీయం. తేజస్వీ యాదవ్ నాయకత్వంలో మహాకూటమి అభివృద్ధి చెందుతుంది " అని సీపీఐ-ఎంఎల్ఎల్ ఎమ్మెల్యే మహబూబ్ ఆలం అన్నారు. తేజస్వీ యాదవ్ ను ప్రమోట్ చేయాలన్న తన కోరికను నితీష్ కుమార్ పదేపదే చెప్పారు. విధాన సభలో జరిగిన మహాఘట్బంధన్ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తేజశ్వి యాదవ్ మా తదుపరి అధ్యక్షుడిగా ఉంటారు " అని ఆర్థిక మంత్రి, జేడీ(యూ) నాయకుడు విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. అయితే, బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ మహాకూటమి నాయకులు 'ఖయాలీ పులావ్' (ఊహాత్మక భోజనం) వండుతున్నారు. 2025లో బీహార్ ముఖ్యమంత్రి ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

click me!