ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై ఎస్ ఐ అఘాయిత్యం.. బలవంతంగా అబార్షన్...

By SumaBala BukkaFirst Published Dec 7, 2021, 1:39 PM IST
Highlights

తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ మహిళ (32)కు వివాహమై 9 యేళ్ల కూతురుంది. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అతను మోసగించడంతో పోలీసులను ఆశ్రయించింది. కాగా భర్తపై ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆమెను సబ్ ఇన్ స్పెక్టర్ సుందర లింగం (40)కేసు పేరుతో ఆమెను పలు చోట్లకు తీసుకెళ్లాడు. 

తమిళనాడు : అతివలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే వారి పాలిట భక్షకులుగా మారుతున్నారు. మహిళలపై rapes and atrocities పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సబ్ ఇన్ స్పెక్టర్. ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. దీంతో తన తప్పు ఎక్కడ బయటపడుతోందోనని ఏకంగా అబార్షన్ కూడా చేయించాడు.

ఈ అమానుషం మీద సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఆ ఎస్ఐతో సహా మరో 8మందిపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు.. tamilnaduలోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ మహిళ (32)కు వివాహమై 9 యేళ్ల కూతురుంది. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అతను మోసగించడంతో పోలీసులను ఆశ్రయించింది.

కాగా భర్తపై ఫిర్యాదు చేసేందుకు Palugal Police Stationకు వెళ్లిన ఆమెను సబ్ ఇన్ స్పెక్టర్ సుందర లింగం (40)కేసు పేరుతో ఆమెను పలు చోట్లకు తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె Pregnancy దాల్చడానికి కారణమయ్యాడు. దీంతో తన నేరం ఎక్కడ బయటపడుతుందోనని బాధితురాలిని సాధారణ వైద్య పరీక్షలని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి.. అబార్షన్ చేయించాడు.

ఈ విషయం తెలసుకున్న బాధితురాలు ఎస్ ఐపై పలుమార్లు, వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. సుందరలింగంతో పాటు మరో 8మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందులో ఆమెకు Abortion చేసిన వైద్యుడు కూడా ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మార్తాండం పోలీసులు విచారణ ప్రారంభించారు. 

వ‌ర‌క‌ట్నంపై చ‌ట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు

ఇదిలా ఉండగా, ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రి వేళ పదిహేడు మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలిచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో  వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే.. 

నవంబర్ 17వ తేదీ రాత్రి Muzaffarnagar లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE Practical Examసాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

అక్కడ ఆ కీచకుడు ఆ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తరువాత మత్తులోకి జారుకున్న అమ్మాయిలపై ఉపాధ్యాయుడు Sexually harassment చేశాడు. మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటి రోజు తేరుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే స్పృహలోకి వచ్చాక తమకు జరిగింది తెలిసినా..  ‘ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని.. చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని’ నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను threatening చేశాడు.

click me!