Nagaland Firing : కత్తులతో దాడి చేసి.. సైనికుడి గొంతు కోసి.. దారుణం..

Published : Dec 07, 2021, 12:52 PM IST
Nagaland Firing : కత్తులతో దాడి చేసి.. సైనికుడి గొంతు కోసి.. దారుణం..

సారాంశం

రైఫిల్ ఉన్నట్లు కనిపించగానే వారు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనంతరం అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులు బలగాలపై తల్వార్ ల వంటి పెద్ద కత్తులతో దాడి చేసినట్లు తెలిపాయి. ఓ సైనికుడిని వారు గొంతు కోసి చంపారని పేర్కొన్నాయి. మొత్తం 13 మంది సైనికులకు కత్తి గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించాయి. 

ఢిల్లీ : Nagaland లోని మోన్ జిల్లాలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలను సంబంధించి తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరు, ఓటింగ్ గ్రామాల మధ్య శనివారం రోడ్డు మీద వెల్తున్న వాహనంలో ఓ పరికరాన్ని చూసి, వేటకు ఉపయోగించే రైఫిల్ గా సైనికులు పొరబడటమే మొత్తం దారుణ పరిణామాలకు మూల కారణమని తెలుస్తోంది. 

Rifle ఉన్నట్లు కనిపించగానే వారు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనంతరం అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులు బలగాలపై తల్వార్ ల వంటి పెద్ద Swordsతో దాడి చేసినట్లు తెలిపాయి. ఓ సైనికుడిని వారు గొంతు కోసి చంపారని పేర్కొన్నాయి. మొత్తం 13 మంది soldiersకు కత్తి గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించాయి. 

ఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రం Nagaland ఆర్మీ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి Amit Shah సోమవారం రోజు Loksabhaలో వివరణ ఇచ్చారు. పౌరులపై ఆర్మీ కాల్పుల్లో 14 మంది మరణించిన ఘటనలపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ పౌరులను ఉగ్రవాదులనే అనుమానంతో ఆర్మీ ఫైరింగ్ జరిపిందని, పొరపాటు జరిగిందని వివరించారు. 

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూస్తామని వివరించారు. ఇప్పటికే ఈ కాల్పులతో ప్రభావితమైన జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు ఉన్నాయని, కానీ, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చస్తున్నదని తెలిపారు.

Nagaland Firing: పొరపాటు జరిగింది.. ఉగ్రవాదులనే అనుమానంతోనే ఫైరింగ్.. లోక్‌సభలో అమిత్ షా

నాగాలాండ్‌లోని పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అయిందని కేంద్ర మంత్రి అమిత్ షా వివరించారు. దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఒక నెలలో దర్యాప్తు పూర్తి చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువరించినట్టు పేర్కొన్నారు. 

తనకు నాగాలాండ్ ఘటనపై సమాచారం అందగానే వెంటనే ఆ రాష్ట్ర గవర్నర్, సీఎంలతో మాట్లాడినట్టు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నదని చెప్పారు. నిన్న మొత్తం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిందని వివరించారు.

నాగాలాండ్ సరిహద్దు జిల్లా మోన్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు ఈ నెల 4వ తేదీన ఆర్మీకి సమాచారం అందిందని ఆయన పార్లమెంటులో తెలిపారు. ఆ సమాచారం ఆధారంగానే 21 మంది కమాండోలు అనుమానిత ప్రాంతంలో నిఘా వేసి ఉన్నారని చెప్పారు. అదే సమయంలో అక్కడికి ఓ వాహనం వచ్చిందని, దాన్ని ఆపాలని ఆర్మీ సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా వెళ్లడానికి ప్రయత్నించారని, దీనితో ఆర్మీలో అనుమానాలు ఏర్పడ్డాయని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu