కానిస్టేబుల్ ఎగ్జామ్.. కాపీ జరక్కుండా ఇంటర్నెట్ బంద్.. రాజస్థాన్‌పై విమర్శలు

First Published Jul 16, 2018, 2:08 PM IST
Highlights

పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరక్కుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలపాలయ్యింది. శని, ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరక్కుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలపాలయ్యింది. రాజస్థాన్ పోలీస్ శాఖలో 13,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష గత శని, ఆదివారాల్లో జరిగింది. అయితే గత అనుభవాల దృష్ట్యా రాజస్ధాన్ ప్రభుత్వం రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

శని, ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.. ఆ సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు, సమాచార సేవలు నిలిచిపోయాయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. దీనికి బదులుగా కేవలం పరీక్షా కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటు చేస్తే సరిపోయేదని రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ప్రభుత్వానికి చురకలు అంటించచారు.

కాగా, ఈ ఏడాది మార్చిలో ఇదే నోటీఫికేషన్ గురించి రాత పరీక్ష నిర్వహించారు.. దీనిలో కొందరు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కొందరు కాపీయింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి.. గత వారం తిరిగి నిర్వహించింది. ఈసారి ఎలాంటి అవకతవకలు జరక్కుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78 నగరాల్లో 664 పరీక్షా కేంద్రాల్లో రెండు విడతలుగా పరీక్షను నిర్వహించారు.

click me!