కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ఆరోగ్య పరిస్థితి విషమం: గోవా సీఎం

By narsimha lodeFirst Published Aug 24, 2020, 8:11 PM IST
Highlights

కరోనా సోకిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాదనాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు.
 


న్యూఢిల్లీ: కరోనా సోకిన కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాదనాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు.

సోమవారం నాడు గోవా సీఎం ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని ఆసుపత్రి వర్గాలు ప్రకటించినట్టుగా ఆయన తెలిపారు.

శ్రీపాదనాయక్ గత 10 రోజుల క్రితం మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. కరోనా సోకడంతో ఆయన ఈ ఆసుపత్రిలో చేరాడు.  ఢిల్లీలోని ఎయిమ్స్  డాక్టర్ల బృందం కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ను పరీక్షించిన తర్వాత ఇక్కడి నుండి ఆయనను ఢిల్లీకి తరలించాలా వద్దా అనేది నిర్ణయిస్తారని గోవా సీఎం చెప్పారు.

67 ఏళ్ల కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ గత సోమవారం నాడు ప్లాస్మా థెరపీ నిర్వహించారు. గత శుక్రవారం నాడు ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఇంతకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘావాల్, ధర్మేంద్ర ప్రధాన్ లుకూడ కరోనా సోకింది.
 

click me!