అన్‌లాక్ 4.0: మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్

By narsimha lode  |  First Published Aug 24, 2020, 7:44 PM IST

అన్ లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైలు సేవలను అనుమతించే అవకాశం ఉంది. ఆన్ లాక్ 3.0 గడువు ఈ నెల 31వ తేదీతో పూర్తి కానుంది. దీంతో నాలుగో విడత అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  కసరత్తు చేస్తోంది.



న్యూఢిల్లీ: అన్ లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైలు సేవలను అనుమతించే అవకాశం ఉంది. ఆన్ లాక్ 3.0 గడువు ఈ నెల 31వ తేదీతో పూర్తి కానుంది. దీంతో నాలుగో విడత అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  కసరత్తు చేస్తోంది.

సెప్టెంబర్ 1వ తేదీ నుండి మెట్రో సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మెట్రో సర్వీసులతో పాటు ప్రజా రవాణాకు ఇతర సేవలకు అనుమతించే అవకాశం ఉందని సమాచారం.

Latest Videos

undefined

విద్యా సంస్థల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా కేసులు ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో స్కూల్స్, కాలేజీల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకొంటారా లేదా అనేది ఇంకా తేలలేదు.

సినిమా థియేటర్లను తెరుస్తారా.. ఈ విషయమై కూడ  చర్చ సాగుతోంది. సినిమా థియేటర్ల యాజమాన్యాలతో ఇటీవల కేంద్రం చర్చించింది. అయితే సగం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచినా కూడ ప్రయోజనం లేదని థియేటర్ల యజమానులు అభిప్రాయపడుతున్నారు.

click me!