రైల్వే నిర్వాకం: రైలు బయల్దేరింది యూపీకి.... కానీ చేరుకుంది ఒడిశాకు!

By Sree s  |  First Published May 23, 2020, 11:10 AM IST

లాక్ డౌన్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులను వారి వారి సొంత ఊళ్లకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నుంచి యూపీకి బయల్దేరిన శ్రామిక్ స్పెషల్ ట్రైన్ దారితప్పి ఒరిస్సా చేరుకుంది. 


లాక్ డౌన్ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులను వారి వారి సొంత ఊళ్లకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నుంచి యూపీకి బయల్దేరిన శ్రామిక్ స్పెషల్ ట్రైన్ దారితప్పి ఒరిస్సా చేరుకుంది. 

వివరాల్లోకి వెళితే... యూపీలోని గోరఖ్ పూర్ కి ముంబైలోని వసై స్టేషన్ నుండి మే 21 నాడు ఒక ప్రత్యేక శ్రామిక రైలును వేసింది ప్రభుత్వం. గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన వలస కూలీలంతా ఇంటికి వెళుతున్నామన్న సంతోషంలో ఆ రైలు ఎక్కారు. 

Latest Videos

అంతా ఇంటికి చేరుకుంటున్నామన్న ఆనందంలో ఉండగా ఇవాళ తెల్లవారుఝామున నిద్ర లేచి చూసేవరకు ఆ రైలు యూపీకి కాకుండా ఒడిశా చేరుకుంది. ఒడిశా లోని రూర్కేల స్టేషన్ లో ఆ ట్రైన్ ప్రత్యక్షమవ్వడంతో ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. 

ఇక నిద్ర నుండి లేచిన వలస కార్మికులు డ్రైవర్ రూటు మర్చిపోయాడని చెబుతుండడంతో వారి అమాయకత్వానికి అక్కడివారంతా నిస్చేష్టులుగా ఉండిపోయారు. 

ఇన్ని రైల్వే స్టేషన్లు, అంతమంది రైల్వే సిబ్బంది, సిగ్నళ్లు, ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ... రైలు ఒడిశా చేరుకోవటమేమిటి అనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఒకవేళ లైన్ క్లియర్ గా లేకపోతే... ఏ మధ్యప్రదేశ్ లోనో ఎక్కడో తేలాలి కానీ ఇలా ఒడిశాకు చేరుకోవడమేనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అధికారులు మాత్రం ఇంతవరకు ఈ విషయమై ఏ విధమైన ప్రకటన కూడా చేయలేదు.

ఇకపోతే.... దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4 లో కొన్ని సడలింపులు చేయడంతో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కాగా.. భారత్ లో ఇప్పటి వరకూ 1,25,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయిి. యాక్టివ్ కేసులు 69,597 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 3,720 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 51,784 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. మహారాష్ట్ర, గుజారాత్, ఢిల్లీ, తమిళనాడుల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 6,654 కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల్లోనే భారత్ లో 16 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.

గురువారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 118,226 గా ఉండగా.. గడిచిన 24 గంటల్లో 6,654 కేసులు పెరిగాయి. కాగా.. మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కేసులు ఇప్పడు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ 6వేలకు పైగా కేసులు పెరుగుతుండటం ప్రజలను కలవర పరుస్తోంది.

click me!