పిల్లికి చిత్ర హింసలు పెడుతూ టిక్ టాక్.. యువకుడు అరెస్ట్

Published : May 23, 2020, 08:36 AM ISTUpdated : May 23, 2020, 08:40 AM IST
పిల్లికి చిత్ర హింసలు పెడుతూ టిక్ టాక్.. యువకుడు అరెస్ట్

సారాంశం

ఓ యువకుడు టిక్ టాక్ లో లైకుల కోసం మరింత క్రూరంగా ప్రవర్తించాడు. ఓ పిల్లిని తీసుకువచ్చి.. దాని మెడకు ఉరివేసి మరీ వీడియో తీశాడు. అయితే..  ఆ వీడియోని చూసిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేయడం గమనార్హం.

ప్రస్తుత కాలంలో టిక్ టాక్ అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరేమో. బ్యాగ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కి తగ్గట్టుగా లిప్ సింక్ ఇవ్వడం.. దానికి తగ్గట్టుగా డ్యాన్స్ లు చేయడం లాంటివి చేసి.. వాటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో వీడియోలు చేసి ఫేమస్ అయ్యి క్రేజ్ సంపాదించుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ప్రాణాలు పొగొట్టుకున్నవాళ్లు కూడా లేకపోలేదు.

తాజాగా.. ఓ యువకుడు టిక్ టాక్ లో లైకుల కోసం మరింత క్రూరంగా ప్రవర్తించాడు. ఓ పిల్లిని తీసుకువచ్చి.. దాని మెడకు ఉరివేసి మరీ వీడియో తీశాడు. అయితే..  ఆ వీడియోని చూసిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేయడం గమనార్హం. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులో ని తిరునెల్వేలి జిల్లా పళవూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్టి కుళానికి చెందిన తంగదురై పశువుల ఫామ్ లో పనిచేస్తున్నాడు. ఈ యువకుడు టిక్ టాక్ యాప్ ఎక్కువగా వినియోగిస్తుంటాడని తెలిసింది. ఎక్కువ లైకుల కోసం తన పెంపుడు పిల్లిని ఉరివేసి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అవి కాస్త వైరల్ కావడంతో.. అతనిపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu