శ్రద్ధావాకర్ మర్డర్ కేసు : ఆఫ్తాబ్ కు ఢిల్లీ టు దుబాయ్ వరకు గర్ల్ ఫ్రెండ్స్.. శ్రద్ధాను చంపి, చికెన్ రోల్ తిని

By SumaBala BukkaFirst Published Feb 8, 2023, 11:50 AM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు ఆరువేల పైచిలుకు పేజీలతో చార్జిషీటు దాఖలు చేశారు. 

ఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.  సహజీవనం చేస్తున్న భాగస్వామిని చంపి ఆమె శరీరాన్ని  ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో చల్లాడు ఓ కిరాతకుడు. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్లో దాచి పెట్టి..  వాటి పక్కనే ఆహార పదార్థాలు పెట్టుకుని తిన్నాడు.  ఇప్పటికే ఈ కేసు  మీకు అర్థమై ఉంటుంది.. నమ్మి వచ్చిన వ్యక్తి చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురి అయిన శ్రద్ధా వాకర్ హత్యకు సంబంధించి పోలీసులు 6,629 పేజీల  చార్జ్ షీట్ను దాఖలు చేశారు.  ఈ చార్జీ షీట్ లో అనేక విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

శ్రద్ధ వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా కట్ చేశాడు. ఆ శరీర భాగాలను ఫ్రిజ్లో పెట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాటిని తీసి వంట గదిలో ఉంచేవాడని చార్జిషీట్లో పేర్కొన్నారు. డెడ్ బాడీని కట్ చేయడానికి రంపం సుత్తి మూడు కత్తులు కొన్నాడు. వేళ్ళు వేరు చేయడానికి బ్లోటార్చేస్ ఐటమ్ ఉపయోగించాడని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. పోలీసులు ఈ చార్జిషీట్ను జనవరి నెల చివర్లో దాఖలు చేశారు.  

పంజాబ్ లో షాకింగ్ ఘటన.. శ్మశానవాటికలో వివాహం, విందుభోజనాలు..

దీంట్లో దాదాపు 150 మంది సాక్ష్యుల వాంగ్మూలాలు నమోదు చేశారు. అందులో సిద్ధ హత్య జరిగిన రోజు ఆఫ్తాబ్ (28) చికెన్ రోల్  జొమాటో లో ఆర్డర్ చేసి తెప్పించుకుని తిన్నట్లుగా పేర్కొన్నారు. ఇక,  ఆఫ్తాబ్.. చెడ్డ హత్య విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా..  శ్రద్ధను హత్య చేసి మృతదేహాన్ని కాల్చి ఎముకలను స్టోన్ గ్రైండింగ్ లో వేసి పొడిచేసి విసిరేసినట్లుగా నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించాడు.

 ఆఫ్ తబకు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు  అనేకమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ‘అతను బంబుల్ డేటింగ్ యాప్ తో అనేకమంది అమ్మాయిలతో  క్లోజ్ గా ఉండేవాడు. ఈ విషయాలన్నింటినీ చార్జిషీట్లో వారు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో జరిగిన శాస్త్రీయ పరీక్షలు కూడా నిందితుడి ప్రమేయాన్ని నేరంలో ధృవీకరించినట్లు తెలిపారు. మంగళవారం నాడు ఆఫ్తాబ్ ను కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తలుపులు మూసిన కోర్టులో న్యాయమూర్తి అవిరల్ శుక్లా విన్నారు. ఆ తరువాత కేసు విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

click me!