బీజేపీకి మద్దతుగా లేని పార్టీ ఒక్కటైనా దేశంలో ఉన్నదా?: విపక్ష ఐక్యకూటమిపై దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Jun 6, 2023, 9:10 PM IST
Highlights

విపక్ష ఐక్య కూటమి గురించి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలో బీజేపీకి మద్దతుగా లేని పార్టీ ఒక్కటైనా ఉన్నదా? అంటూ ఆయన ప్రశ్నించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమితో జేడీఎస్ జతకడుతుందనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
 

బెంగళూరు: జేడీఎస్ సుప్రీమ్ లీడర్ హెచ్‌డీ దేవేగౌడ మంగళవారం విపక్ష ఐక్యకూటమి ప్రయత్నాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ కమ్యూనల్ ఏదీ కాదు అనేది తాను చెప్పలేనని అన్నారు. ఈ దేశంలో బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వని పార్టీ ఒక్కటైనా ఉన్నదా? అని ప్రశ్నించారు.

‘నేను ఈ దేశ రాజకీయాలను విశ్లేషించగలను. కానీ, ఏం ప్రయోజనం. బీజేపీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం లేని పార్టీ ఒక్కటైనా ఉన్నదా? ఈ దేశం మొత్తంలో అలాంటి పార్టీ ఒకటి చూపెట్టండి. అప్పుడు నేను సమాధానం చెబుతా?’ అని దేవేగౌడ అన్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ఐక్యత గురించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రస్తావించగా హెచ్‌డీ దేవేగౌడ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

‘కొందరు కాంగ్రెస్ నేతలు అంటారేమో అని దేవేగౌడ పేర్కొన్నారు. వాళ్లు కూడా కరుణానిధి మద్దతు కోసం వెళ్లలేదా? బీజేపీకి ఆరేళ్లు డీఎంకే మద్దతు ఇవ్వలేదా? అది ప్రత్యక్షంగానా? పరోక్షంగానా? అన్నది వేరే విషయం.. అందుకే దేశంలోని రాజకీయాల గురించి చర్చించాలని అనుకోవడం లేదు. ఆ అవసరం లేదు. ఈ రాజకీయాలను నేను ప్రధానిగా, ముఖ్యమంత్రిగా, ఎంపీగా దగ్గరగా చూశాను. మహారాష్ట్రలో ఏమైంది? ఇలా నేను చాలా ఉదంతాలు ప్రస్తావించగలను.’ 

Also Read: అది దేశానికి చీకటి రోజు.. మేం రోడ్లపై, నిందితుడు పార్లమెంటులో.. : రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన వ్యాఖ్యలు

2024 లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ బీజేపీ కూటమితో జతకడుతుందని వాదనలు వచ్చాయి. బీజేపీ కూటమిలో చేరుతారా? ఆ కూటమికి సారథ్యం వహిస్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఈ వాదనలను  ఆయన ఖండించారు. తమకు లోక్ సభ ఎన్నికల కంటే ముందు పార్టీని బలోపేతం చేయాలనే దానిపైనే ఫోకస్ ఉన్నదని తెలిపారు. ముందుగా జిల్లా, తాలూకా, మున్సిపాలిటీ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

అనంతరం, బలమైన ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బలమైన పార్టీలను పేర్కొన్నారు. ఆ దిశగా జేడీఎస్‌ను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చి జేడీఎస్‌ను బలోపేతం చేయాలని తెలిపారు.

click me!