పెళ్లి పందిరిలోనే వధువు కాళ్లు తాకిన వరుడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

By narsimha lode  |  First Published Feb 20, 2024, 10:02 AM IST

అసోం రాష్ట్రంలో  ఓ పెళ్లిలో జరిగిన ఘటన  సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఘటనపై నెటిజన్లు తలో రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.


న్యూఢిల్లీ:  పెళ్లైన కొద్దిసేపటికే  వధువు పాదాలను వరుడు తాకాడు..ఈ దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసోంలోని గౌహతికి చెందిన ఓ వ్యక్తి తన వివాహానికి సంబంధించిన కీలకమైన ఘట్టాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని క్షణాల్లో  వందలాది  తిలకించారు.ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. 

వివాహం జరిగిన తర్వాత సంప్రదాయం ప్రకారంగా  వధువు వరుడి పాదాలను తాకింది.  ఆ తర్వాత కొద్ది క్షణాలకేు  వరుడు కూడ తన భార్య పాదాలను తాకాడు.ఈ దృశ్యాలను చూసిన  బంధువులు చప్పట్లు కొడుతూ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Latest Videos

మరో వైపు ఈ విషయమై వరుడు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.  తన భార్య పాదాలను తాకడంపై  సమాజం నుండి తనపై విమర్శలు వచ్చినప్పటికీ తాను ఎవరి అభిప్రాయాలను లేదా ఆచారాలను కించపర్చాలని అనుకోలేదన్నారు.తాను ఏది చేసినా అది తన భార్య పట్ల గౌరవం మాత్రమేనని ఆయన  సోషల్ మీడియా వేదికగా  వ్యాఖ్యానించారు.

also read:గూగుల్ ఉద్యోగికి 300 శాతం వేతనం పెంపు: ఎందుకో తెలుసా?

ఈ వీడియో పోస్టు చేసిన వెంటనే  2 మిలియన్లకు పైగా చూశారు. ఇదిలా ఉంటే ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వధువుల పాదాలను తాకుతున్న వరుడిని ఎవరూ ఆపలేదు... పైగా అతడిని ప్రోత్సహించారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. 

also read:తెలంగాణలో గ్రూప్-1 : 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

అవును.. సరిగ్గా అలానే ఉండాలని మరొకరు అభిప్రాయపడ్డారు.  ప్రతి పెళ్లికి ఇలాగే ఉండాలి.. సమాన గౌరవం.. సమానంగా విలువ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.  దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదిస్తాడని  మరొకరు వ్యాఖ్యానించారు.

click me!