ఐఐటీ క్యాంపస్ సరిహద్దులను జనావాసాల నుంచి వేరు చేయాలని, నిందితుల ఆచూకీ తొందరగా కనిపెట్టాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయడంపై మెమోరాండం కూడా ఇచ్చారు.
వారణాసి : అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యాలయాలు కీచకులకు అడ్డాలుగా మారుతున్నాయి. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థినుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ.. దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటన వారణాసిలో వెలుగు చూసింది.
బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటి బీహెచ్యూ చదువుతున్న విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలోకి ముగ్గురు దుండగులు బైక్ పై వచ్చారు. ఓ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె బట్టలు విప్పించారు. అదంతా వీడియో తీశారు. ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
భారత యూజర్లకు షాకిచ్చిన మెటా.. ఒక్కనెలలోనే 71 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. ఎందుకంటే..?
దీనికి సంబంధించిన వివరాలలోకి పెడితే… బుధవారం రాత్రి ఓ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి హాస్టల్ కు దగ్గర్లో ఉన్న కర్మన్ బాబా ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలోనే ఆలయం దగ్గరికి ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చారు. స్నేహితుడితో ఉన్న బాధితురాలిని టార్గెట్ చేశారు. ఆమెని బలవంతంగా ఓవైపుకు లాక్కెళ్లారు. అక్కడ అసభ్యంగా వేధింపులకు పాల్పడ్డారు. ఆమెతో దుస్తులన్నీ తీయించారు. నగ్నంగా చేసి వీడియోలు చిత్రీకరించారు. ఫోటోలు తీశారు.
ఈ దురాగతం 15 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత బాధితురాలు సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఈ షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గుర్తుతెలియని దుండగుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారి కోసం గాలిస్తున్నారు.