అలా ఎవరన్నారు? నేనే ఐదేళ్లు సీఎం: సీఎం సీటు షేరింగ్‌పై సిద్ధరామయ్య కామెంట్

By Mahesh K  |  First Published Nov 2, 2023, 9:56 PM IST

కర్ణాటక సీఎంగా ఐదేళ్లు నేనే కొనసాగుతాను. పవర షేరింగ్ గురించి ఎవరు చెప్పారు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయపార్టీ. ఏ నిర్ణయమైనా అధిష్టానం చర్చించిన తర్వాతే తీసుకుంటారు అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
 


బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం సీటు పై దీర్ఘకాలం చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ జరిగింది. చివరకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎం చేసి, డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేసింది. పవర్ షేరింగ్ పై ఒప్పందం కుదిరిందని, సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు చేపడతారనే చర్చ జరిగింది. అయితే.. అధిష్టానం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 

తాజాగా, కర్ణాటకలో ఇదే విషయం తరచూ చర్చకు వస్తున్నది. మలి రెండున్నరేళ్ల పాటు సీఎంగా డీకే శివకుమార్ కొనసాగుతారని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు. హెచ్ సీ మహాదేవప్ప, కేఎన్ రాజన్న, సతీశ్ జార్కిహోలి, అశోక్ పట్టాన్ తర్వాత ఇప్పుడు మాండ్యా ఎమ్మెల్యే రవి కుమార్ గానిగా శుక్రవారం ఇదే విషయాన్ని మాట్లాడారు.

Latest Videos

undefined

ఈ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తానే ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. మా ప్రభుత్వానికి నేనే ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్నంత కాలం నేనే సీఎం’ అని సిద్ధరామయ్య అన్నారు. 

Also Read: నేనిప్పుడు బీజేపీలో ఉన్నాను.. ‘వ్యూహం’ సినిమాపై జీవిత రాజశేఖర్ ఏమన్నారంటే?

పవర్ షేరింగ్ కామెంట్లపై స్పందిస్తూ ‘ఎవరు చెప్పారు? ఈ నిర్ణయాలను హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఇది జాతీయ పార్టీ. హైకమాండ్ చర్చించకుండా ఏదీ ఇక్కడ మారదు’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

click me!