రూ. 2 వేల నోట్ల మార్చడానికి కూలీలు.. ఒక్కరికి రోజు కూలి రూ. 300

ఒడిశాలో రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి కొందరు బడాబాబులు నిరుపేదల సహాయం తీసుకుంటున్నారు. వారికి రూ. 300 రోజుకు కూలి ఇచ్చి వారి ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకుంటున్నట్టు మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. 
 

for rs 2000 notes exchange, rich men hired poor  labours in odisha with rs 300 for their pay kms

న్యూఢిల్లీ: ఆర్బీఐ బ్యాంక్ రూ. 2000 నోట్లను క్రమంగా చలామణిలో నుంచి తొలగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ ప్రకటన చేసి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంతలోపే అన్ని బ్యాంకుల్లో నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సంబంధిత షరతులతో అవకాశం ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత దేశంలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చింది. 

బ్లాక్ మనీ నగదుగా ఉంటే.. అది పెద్ద నోట్ల రూపంలోనే ఉంటుంది. చలామణిలో రూ. 2000 నోట్లే పెద్దవి. వీటిని ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకుల్లో మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. అక్రమార్కలు ఒక దారిమూతపడితే మరో దారి వెతుక్కుంటున్నట్టే.. ఇక్కడ బ్లాక్ మనీ బాబులు కూలీలను పెట్టి రూ. 2000 నోట్లను ఏమాత్రం తమ గోప్యతకు భంగం కలుగకుండా బదిలీ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Latest Videos

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ ఆర్బీఐ ప్రాంతీయ బ్యాంకు ఉన్నది. ఈ బ్యాంకులో కొందరు బడా బాబులు తమ వద్దనున్న రూ. 2000 నోట్లను కూలీలకు ఇచ్చి వారి సమాచారంతోనే మార్చుకునే ఎత్తు వేశారు. ఇలా తమ డబ్బును రూ.2000 నోట్ల నుంచి మిగిలిన నోట్లలోకి మార్చినందుకు కూలీలకు రజుకు రూ. 300 కూలి ఇస్తున్నట్టు వార్తా కథనాలు వచ్చాయి. 

Also Read : అలా ఎవరు అన్నారు ? నేనే ఐదేళ్లు సీఎం: సీఎం సీటు షేరింగ్‌ పై సిద్ధరామయ్య కామెంట్

దీంతో ఒడిశా పోలీసులు అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగారు. నోట్ల మార్పిడికి వచ్చే వారి ఆధార్ కార్డులు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. నోట్ల మార్పిడికి పోస్ట్ ద్వారా మార్చుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే.. ఆ విధానంలో తమ వివరాలు బయట పడతాయనే భయంతోనే కొందరు బడా బాబులు పేదలతో ఇలా పని చేయించుకుంటున్నారని చర్చిస్తున్నారు. లేకుంటే ఇప్పుడు పేదల దగ్గర రూ. 2000 నోట్లు ఉండే చాన్స్ లేదని మాట్లాడుకుంటున్నారు.

vuukle one pixel image
click me!