హనీ సింగ్ తండ్రి కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. షాలినీ షాకింగ్ కామెంట్స్..

Published : Aug 07, 2021, 08:03 AM IST
హనీ సింగ్ తండ్రి కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. షాలినీ షాకింగ్ కామెంట్స్..

సారాంశం

ఆనాటి నుంచి తమ మధ్య ఎన్నో మనస్పర్థలు వచ్చినట్లు షాలినీ పేర్కొన్నారు. దాదాపు 118 పేజీల ఫిర్యాదు ఆమె అందజేయడం గమనార్హం.

మన దేశంలోని ప్రముఖ పాప్ సింగర్స్ లో యోయో హనీసింగ్ కూడా ఒకరు. ఆయన పాటలకు లక్షల్లో అభిమానులు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా హనీసింగ్ పై ఆయన భార్య షాలినీ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. హనీసింగ్.. అతని కుటుంబ సభ్యులు.. తనని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు.

కాగా.. హనీసింగ్, షాలినీలు దాదాపు పదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత.. 20211 జనవరిలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆనాటి నుంచి తమ మధ్య ఎన్నో మనస్పర్థలు వచ్చినట్లు షాలినీ పేర్కొన్నారు. దాదాపు 118 పేజీల ఫిర్యాదు ఆమె అందజేయడం గమనార్హం.

తనతో పెళ్లి విషయాన్ని హనీసింగ్ ఎవరికీ చెప్పకుండా ఎంతో రసహ్యంగా ఉంచాడని.. పలు సందర్భాల్లో తాను పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశానని.. తనని చిత్ర హింసలకు గురిచేశాడని ఆమె వాపోయింది. ఒకసారి కనీసం 18 గంటలపాటు తనకు కనీసం భోజనం కూడా పెట్టలేదని.. ఒక గదిలో బంధించి ఉంచాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా.. హనీసింగ్ కి ఎంతో మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. ఓసారి తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని ఆమె చెప్పారు. ఈ విషయంలో ప్రశ్నించినందుకు తనపై మద్యం సీసాతో దాడి చేయబోయాడని ఆమె చెప్పారు.

హనీసింగ్ తండ్రి కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఇలాంటి వాటితో తాను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌