Tomato price: సామాన్యుడికి షాక్.. !సెంచ‌రీ కొట్టిన ట‌మాటో..

Published : Jun 26, 2023, 07:56 PM IST
Tomato price: సామాన్యుడికి షాక్.. !సెంచ‌రీ కొట్టిన ట‌మాటో..

సారాంశం

Tomato price: మార్కెట్ లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వామ్మో ఇంత ధరలు పెట్టి కూరగాయలు కొనాలా అనేలా సామాన్య కుటుంబాలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. త‌ప్ప‌దు కాబ‌ట్టి ఇంత‌కుముందులా కాకుండా కాస్త త‌క్కువ‌గా కొంటున్నారు. ట‌మాటో కేజీ ధ‌ర‌లు ప‌లు చోట్ల రూ.100 ల‌కు చేర‌డం మునుముందు ఎలా ఉంటుందోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

Kg Tomato price reaches RS 100: మార్కెట్ లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వామ్మో ఇంత ధరలు పెట్టి కూరగాయలు కొనాలా అనేలా సామాన్య కుటుంబాలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. త‌ప్ప‌దు కాబ‌ట్టి ఇంత‌కుముందులా కాకుండా కాస్త త‌క్కువ‌గా కొంటున్నారు. ట‌మాటో కేజీ ధ‌ర‌లు ప‌లు చోట్ల రూ.100 ల‌కు చేర‌డం మునుముందు ఎలా ఉంటుందోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. కూరగాయ‌ల ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. ట‌మాటో అయితే ఆకాశ‌మే హ‌ద్దుగా రికార్డు ధ‌ర వైపు ప‌రుగులు పెడుతోంది. చాలా ప్రాంతాల్లో వారం క్రితం వరకు కిలో టమాటో  కేజీ ధర 10 రూపాయలు కూడా లేని ప‌రిస్థితి ఉండేది. అయితే, అన్యూహ్యంగా ప్ర‌స్తుతం ట‌మాటో రేటు 70 నుంచి 80 రూపాయల వరకు పెరిగింది. రిటైల్ మార్కెట్ లో ప‌లు చోట్ల మంచి ప్రెష్ ట‌మాటో ధ‌ర సెంచ‌రీకి చేరింది. దీంతో సామాన్యుల ట‌మాట‌ను కొనే ప‌రిస్థితి లేదు. వామ్మో ఇంత ధరలు పెట్టి కూరగాయలు కొనాలా అనేలా సామాన్య కుటుంబాలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. త‌ప్ప‌దు కాబ‌ట్టి ఇంత‌కుముందులా కాకుండా కాస్త త‌క్కువ‌గా కొంటున్నారు. ట‌మాటో కేజీ ధ‌ర‌లు ప‌లు చోట్ల రూ.100 ల‌కు చేర‌డం మునుముందు ఎలా ఉంటుందోన‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ఏడాది రుతుపవనాల లోటు కారణంగా టమోటో సహా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరఫరా కొరత కారణంగా గత వారం రోజుల్లోనే  కిలో టామాటో రూ.80 వరకు ధరలు పెరిగాయి. ఈ వారాంతంలో కర్ణాటకలోని కోలార్ హోల్సేల్ ఏపీఎంసీ మార్కెట్లో 15 కిలోల టమాటాను రూ.1,100కు విక్రయించారు. త్వరలో బెంగళూరులో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే టమాటా ధర రూ.100 మార్కును దాటే అవకాశం ఉందని కిరాణా సంస్థ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నార‌ని ది హిందూ నివేదించింది. గత ఏడాదితో పోలిస్తే కూరగాయల సాగు తక్కువగా ఉందని కోలార్కు చెందిన టమోటా రైతు అంజిరెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయాయనీ, ఇక్కడ టమాటా పంట సాధారణం కంటే 30 శాతం మాత్రమే ఉంటుందని రైతు తెలిపారు. మహారాష్ట్రలో పంట నష్టం కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ వంటి  ప్రాంతాల‌కు ఎగుమతి చేయడానికి కూడా కొనుగోలుదారులు కర్ణాటక మార్కెట్లలో క్యూ కడుతున్నారు. ఇది కూడా స్థానికంగా ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణంగా ఉంది.

ఆషాఢ మాసం కావడంతో ఎలాంటి శుభకార్యాలు జరగవనీ, కర్ణాటకను వర్షాలు ముంచెత్తుతాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ రుతుపవనాల లోపం పంట నష్టానికి దారితీసింది, చివరికి సరఫరా కొరత, అధిక ధరలకు దారితీసింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మినహా మిగిలిన కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు కిలో బీన్స్ ధర రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతోంది. మరోవైపు కొన్ని రకాల క్యారెట్ల ధర రూ.100 మార్కుకు ప‌రుగులు తీస్తోంది. కిలో క్యాప్సికమ్, నోల్ ఖోల్ ధర రూ.80కి పైగానే ఉంది. ప్రస్తుతం గుడ్డు రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఏపీల్లో కూడా కూర‌గాయ‌లు ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. ట‌మాటో కిలో 80 రూపాయ‌ల వ‌ర‌కు ప‌లుకుతోంది. ఈ వారంలోనే 100 రూపాయ‌ల‌కు చేరే అవ‌కాశ‌ముంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ట‌మాటో పాటు ప‌చ్చి మిర్చి, చిక్కుడు, బెండకాయ, వంకాయలు సహా ఇతర కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu