విచిత్రం : బతికున్న వ్యక్తికి డెత్ సర్ఠిఫికెట్.. తీసుకెళ్లమంటూ అతనికే కాల్ చేసి.. !!

By AN TeluguFirst Published Jul 2, 2021, 9:28 AM IST
Highlights

మహారాష్ట్ర, థానేలో ఓ వింత జరిగింది. ఓ వ్యక్తికి తన డెత్ సర్ఠిఫికెట్ తీసుకెళ్లమని స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అతనికే కాల్ వచ్చింది. దీంతో షాక్ అయిన అతడు వెడితే..

మహారాష్ట్ర, థానేలో ఓ వింత జరిగింది. ఓ వ్యక్తికి తన డెత్ సర్ఠిఫికెట్ తీసుకెళ్లమని స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ నుంచి అతనికే కాల్ వచ్చింది. దీంతో షాక్ అయిన అతడు వెడితే..

అతని పేరు చంద్రశేఖర్ దేశాయ్.. ఓ రోజు అతనికి  థానే మునిసిపల్ కార్యాలయం నుండి ఫోన్ వచ్చింది. అతను మాట్లాడుతూ.. "నా మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లమని థానే మునిసిపల్ కార్పొరేషన్ నుండి నాకు కాల్ వచ్చింది" అని చంద్రశేఖర్ దేశాయ్ ANI కి చెప్పారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో వైరల్ గా మారింది. దీంతో థానే మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ దీని మీద వివరణ ఇచ్చారు. సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో ఫోన్ చేయకముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేలా తమ సిబ్బందికి చెప్పామని తెలిపారు. అయితే ఇది తమకు తెలిసి జరిగింది కాదు అన్నారు. 

"మేము ఈ జాబితాను పూణే కార్యాలయం నుండి తీసుకున్నాం, డెత్ సర్ఠిఫికెట్ జారీ చేయాల్సిన లిస్టులో అతని పేరు ఉంది. అది పూర్తిగా టెక్నికట్ ఎర్రర్.. జాబితాను మరోసారి చెక్ చేయమని మా బృందానికి ఆదేశాలిచ్చాం. ఆ తరువాతే మిగతా వ్యక్తుల్ని పిలవాలని కూడా చెప్పాం’అన్నారాయన. 

అయితే, దేశాయ్ కి 2020 ఆగస్టులో COVID-19 పాజిటివ్ వచ్చింది. తరువాత దాని నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో అతను క్వారంటైన్ ఉన్నప్పుడు ఇలాగే మున్సిపల్ కార్యాలయం నుంచి ఓ సారి కాల్ వచ్చింది. ఆ సమయంలో అతని నెం. ఇలా ఫీడ్ అయి ఉండొచ్చు.. అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

ఏదేమైనా బతికున్న వ్యక్తిని చనిపోయినట్టుగా ధృవీకరించడం.. అతనికే కాల్ చేసి డెత్ సర్ఠిఫికెట్ తీసుకెళ్లమనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

click me!