చనిపోయాడనుకున్న వ్యక్తి.. పది నెలల తర్వాత...!

Published : Jul 02, 2021, 09:26 AM IST
చనిపోయాడనుకున్న వ్యక్తి.. పది నెలల తర్వాత...!

సారాంశం

కరోనా కారణంగా అతని ఉపాధి దెబ్బతినడంతో..10 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజల క్రితం ఓ గుర్తుతెలియని శవం కనపడగానే.. అది చిన్నకన్ను దేనని అందరూ భావించారు.   

చనిపోయాడనుకున్న వ్యక్తి దాదాపు పది నెలల తర్వాత తిరిగి మళ్లీ కనిపించాడు.  దీంతో.. చనిపోయాడుకున్న వ్యక్తి  తిరిగి రావడంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శివగంగై జిల్లా కారైకుడి సమీపంలో గల కల్లుపట్టికి  చెందిన చిన్నకన్ను(46) పదేళ్ల క్రితం భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. పాత సామాన్లు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. కరోనా కారణంగా అతని ఉపాధి దెబ్బతినడంతో..10 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది రోజల క్రితం ఓ గుర్తుతెలియని శవం కనపడగానే.. అది చిన్నకన్ను దేనని అందరూ భావించారు. 

దీంతో వారి బంధువులు, సోదరి మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. శివగంగై ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకోవాల్సిందిగా సూచించారు. చిన్నకన్ను మృతిచెందిన సమాచారం అందడంతో అతన్ని విడిచి వెళ్లిన భార్య వలర్మతి, బంధువులు కల్లుపట్టికి చేరుకున్నారు. మృతదేహాన్ని తీసుకునేందుకు శివగంగై వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడున్న బంధువు ఒకరు దేవకోటైలో రెండురోజుల క్రితం చిన్నకన్నును చూసినట్లు తెలిపాడు. బంధువులంతా దేవకోటైలో ఉండగా ఊపిరి పీల్చుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌