కొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం: ఆ బాధ్యతలకు ఉద్ధవ్ గుడ్‌భై

Published : Nov 28, 2019, 04:50 PM ISTUpdated : Nov 28, 2019, 05:24 PM IST
కొద్దిసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం: ఆ బాధ్యతలకు ఉద్ధవ్ గుడ్‌భై

సారాంశం

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే మరికొద్ది క్షణాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక పదవి నుంచి తప్పుకున్నారు. 

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే మరికొద్ది క్షణాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక పదవి నుంచి తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉద్థవ్ వెల్లడించారు.

సామ్నా పత్రికను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే 1988లో స్థాపించారు. అప్పటి నుంచి పార్టీకి గొంతుకగా సామ్నా మారిపోయింది. ఈ పత్రిక వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు ఉద్ధవ్ థాక్రేనే చూసుకునేవారు.

Also Read:ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నది వీరే...

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో పదవిలో ఉండటం భావ్యం కాదని భావించిన ఉద్థవ్ ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు.

మరోవైపు ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి శివాజీ పార్క్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఉద్ధవ్‌తో పాటు మరో ఏడుగురు ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మరో 6గురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన నుండి ఎకనాథ్ షిండే, సుభాష్ దేశాయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

ఎన్సీపీ నుండి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్ బల్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బాలాసాహెబ్ తొరాట్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమైనట్టు సమాచారం. పృథ్వీ రాజ్ చవాన్ స్పీకర్ పదవి చేపట్టనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 

Also Read:మ'హైడ్రామా' ఉద్ధవ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో అజిత్ పవార్ ఫోన్ స్విచ్ ఆఫ్

ఒకవేళ ప్రిథ్వీరాజ్ చవాన్ స్పీకర్ పదవిని చేపడితే ఆయన ప్రమాణస్వీకారం చేయకపోవచ్చు. లేదు కాబినెట్ బెర్త్ తీసుకుంటే మాత్రం పృథ్వీ రాజ్ చవాన్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. మొత్తానికి బాలాసాహెబ్ థోరాట్ ప్రమాణస్వీకారం చేయడం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu