మద్యపాన నిషేధం దిశగా మధ్యప్రదేశ్: శివరాజ్ సింగ్ చౌహాన్

Siva Kodati |  
Published : Feb 07, 2021, 02:20 PM ISTUpdated : Feb 07, 2021, 02:22 PM IST
మద్యపాన నిషేధం దిశగా మధ్యప్రదేశ్: శివరాజ్ సింగ్ చౌహాన్

సారాంశం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.

అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం లేకుండా చేసేందుకు దానిపై నిషేధం విధించ‌డం మాత్ర‌మే స‌రి‌పోద‌ని, మ‌ద్యం తాగే వారు ఉంటే అక్ర‌మంగానైనా సరఫరా చేస్తూనే ఉంటార‌ని సీఎం చెప్పారు.

అందువల్ల మద్యం సేవించకుండా ప్రచార కార్య‌క్ర‌మాల‌నూ నిర్వహిస్తామని తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ను ఓ మంచి రాష్ట్రంగా మారుస్తామని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణ‌యం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కాగా, బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లోనూ మ‌ద్యంపై నిషేధం విధించాలంటూ గ‌త నెల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి అన్నారు.

అయితే, మధ్యప్రదేశ్‌లో కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దీనికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !