ఉత్తరాఖండ్‌‌లో విరిగిపడ్డ మంచుచరియలు, దౌలిగంగా నదికి వరద: హైఅలెర్ట్

By narsimha lodeFirst Published Feb 7, 2021, 1:23 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నదికి సమీపంలోని రేని గ్రామంలో ధౌలి గంగాలో భారీ వరద సంబవించింది.మంచు చరియలు విరిగిపడడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.మంచు కరగడం వల్ల  భారీగా వరద నీరు ప్రవహిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నదికి సమీపంలోని రేని గ్రామంలో ధౌలి గంగాలో భారీ వరద సంబవించింది.మంచు చరియలు విరిగిపడడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది.మంచు చరియలు విరిగిపడడం వల్ల  దౌలి గంగా నదికి భారీగా వరద నీరు చేరింది.ప్రమాకరస్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. పవన్ ప్లాంట్ వద్ద  మంచు చరియలు విరిగిపడ్డాాయి. రైనీ తపోవన్ పవర్ ప్రాజెక్టులోకి నీరు చేరుకొంది.

రైనీ తపోవన్ గ్రామం వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి రైనీ వద్ద ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీరు చేరడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టు దెబ్బతింది.

పరిస్థితి తీవ్రంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

నది ఒడ్డున గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఖాళీ చేయాలని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. చమోలి జిల్లా నుండి ఒక విపత్తు నివేదించబడింది, పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిపాలన, జిల్లా పోలీస్, విపత్తు విభాగాలను ఆదేశించినట్టుగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు.ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొంటుందన్నారు. ఈ విషయమై ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఆయన కోరారు.

చమోలి జిల్లాలోని జోషిమత్ ప్రాంతంలో గ్రామానికి సహాయక బృందాలు చేరుకొన్నాయి. వందలాది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.హరిద్వార్, కేదార్‌నాథ్ , భద్రినాథ్ లకు కూడ అలెర్ట్ జారీ చేశారు. "

నీటి ప్రవాహం వేగంగా దిగువకు ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

click me!