వివాహేతర సంబంధం: జంటకు చెప్పుల దండ, దాడి

Published : Feb 07, 2021, 02:12 PM IST
వివాహేతర సంబంధం: జంటకు చెప్పుల దండ, దాడి

సారాంశం

వివాహేతర సంబంధం ఉందనే నెపంతో ఓ జంటపై గ్రామస్థులు  చెప్పుల దండ వేసి దాడి ఊరేగించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకొంది.

ఆగ్రా: వివాహేతర సంబంధం ఉందనే నెపంతో ఓ జంటపై గ్రామస్థులు  చెప్పుల దండ వేసి దాడి ఊరేగించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకొంది.

వివాహేతర సంబంధం ఉందనే నెపంతో ఇద్దరిని గ్రామస్తులు బంధించి చిత్రహింసలు పెట్టారు. చెప్పుల దండ వేసి అవమానించారు. గ్రామంలో ఊరేగించారు.ఆగ్రాకు సమీపంలోని జఖా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అక్రమ సంబంధం పెట్టుకొన్న దంపతులను గ్రామస్తులు చెప్పులతో కొట్టారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ యువతి, యువకుడు గ్రామం వదిలి వెళ్లారు. ఈ నెల 5వ తేదీన ఈ జంట గ్రామానికి వచ్చింది.గ్రామానికి వచ్చిన జంటను ఈ నెల 6వ తేదీన గ్రామస్తులు దండించారు. ఈ జంట ఒకే సామాజికవర్గానికి చెందినవారు.వివాహిత యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వివాహిత భర్త ఆమెను తీసుకొని తాజ్ గంజ్ ప్రాంతానికి వెళ్లాడు. 

అయితే భర్త నివాసం నుండి వివాహిత నెల రోజుల క్రితం అదృశ్యమైంది. రెండు రోజుల క్రితం యువకుడితో కలిసి గ్రామానికి వచ్చింది. దీంతో వీరిద్దరిని గ్రామస్తులు చితకబాదారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu