ఉద్దవ్ పై విమర్శలు.. బీజేపీ నేతపై ఇంకు చల్లి, చీరకట్టించి ఊరేగించిన శివసేన నాయకులు

By AN TeluguFirst Published Feb 8, 2021, 4:17 PM IST
Highlights

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించిన వ్యక్తిపై శివసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించిన నాయకుడిపై ఇంకుచల్లి పిడిగుద్దులతో దాడి చేశారు. అంతటితో వదిలపెట్టకుండా అతనికి చీరకట్టి ఊరేగింపు చేశారు.

దీనిమీద బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వెంటనే స్పందించి 17మంది అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్ లో బీజేపీ నేత శిరీష్ కాటేకర్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశారు. 

దీంతో శివసేన కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు. అతని మీద ఇంకు చల్లి పిడిగుద్దులతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనకు బలవంతంగా చీర కట్టి వీధుల్లో ఊరేగించారు. దాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటన మీద పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే ఈ దాడి విషయం తెలుసుకున్న పోలీసులు శివసేన నాయకులను అడ్డగించారు. 

పోలీసుల్ని తోసేసి మరీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తమ పార్టీ అధినేతలపై కాటేకర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే అతడిపై దాడి చేసినట్లు శివసేన నాయకులు తెలిపారు. 

click me!