ఉత్తరాఖండ్‌లో వరదలు: 18 మంది మృతి, 200 ఆచూకీ గల్లంతు

By narsimha lodeFirst Published Feb 8, 2021, 3:57 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌లోని చమౌలి జిల్లాలో ఆదివారం నాడు మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా, అలకానంద నదుల్లో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా  18 మంది మృతి చెందారు. మరో 200 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అధికారులు ప్రకటించారు.


డెహ్రాడూన్:ఉత్తరాఖండ్‌లోని చమౌలి జిల్లాలో ఆదివారం నాడు మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా, అలకానంద నదుల్లో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా  18 మంది మృతి చెందారు. మరో 200 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అధికారులు ప్రకటించారు.

రిషిగంగా పవర్ ప్రాజెక్టు సమీపంలోని నివాసం ఉంటున్న స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు నదుల పరివాహక  ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఐటీబీపీ, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.రిషిగంగా పవర్ ప్లాంట్ లో 148 మంది పనిచేస్తున్నారు. 
మెరుపు వేగంతో వచ్చిన వరదల కారణంగా ఉత్తరాఖండ్ లో 18 మంది మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 200 మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు తెలిపారు.

ఈ నదుల పరిస్థితిని రిమోట్ పర్యవేక్షణ ద్వారా లేదా సమీపంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షిస్తే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు.
 

click me!