BJP vs Shivsena: వారు "న‌వ హిందుత్వవాదులు".. బీజేపీపై సంజ‌య్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

By Rajesh KFirst Published Jan 25, 2022, 1:05 PM IST
Highlights

 BJP vs Shivsena: హిందూత్వ అంశంపై బీజేపీ, శివ‌సేన పార్టీల మ‌ధ్య మొద‌లైన వివాదం ఇంకా చ‌ల్లార‌లేదు. రెండు పార్టీల నేత‌లు పోటీప‌డి హిందూత్వ అంశంపై వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ సొంత ప‌త్రిక అయిన సామ్నా సంపాద‌కుడు సంజ‌య్ రౌత్.. దేశంలో హిందూత్వ అంశంపై ఎన్నిక‌ల్లో పోటీప‌డుతున్న తొలిపార్టీ త‌మ‌దేన‌ని చెప్పుకొచ్చారు.
 

BJP vs Shivsena: హిందుత్వ అంశంపై బీజేపీ, శివ‌సేన పార్టీల మధ్య మాట‌ల‌ యుద్ధం కొస‌సాగుతోంది. ఇరు పార్టీల నేత‌లు పోటీప‌డి హిందూత్వ అంశంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ సొంత ప‌త్రిక అయిన సామ్నా సంపాద‌కుడు సంజ‌య్ రౌత్..  దేశంలో హిందూత్వ అంశంపై ఎన్నికల్లో పోటీ చేసిన‌ తొలి పార్టీ త‌మ‌దేన‌ని నొక్కి చెప్పారు.

ఎన్నికల్లో హిందుత్వ అంశంపై పోటీ చేస్తున్న తొలి పార్టీ శివసేన. బీజేపీలోని కొత్త నేత‌లు (నవ
హిందుత్వవాది).. నవ హిందుత్వవాదుల‌కు అస‌లు హిందూత్వ చ‌రిత్రే తెలియ‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కొంద‌రు త‌మ చ‌రిత్ర‌ను తామే చెరిపేసుకుంటున్నార‌ని బీజేపీ నేత‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. అయినా.. ఎప్పటికప్పుడు వారికి  తాము స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా హిందూత్వ‌కు సంబంధించిన స‌మాచారాన్ని వాళ్ల‌కు తెలియ‌జేస్తామ‌ని శివసేన నేత సంజయ్ రౌత్  పేర్కొన్నారు.

గ‌త మూడు రోజులుగా బీజేపీ, శివ‌సేన పార్టీల మ‌ధ్య  వివాదం కొన‌సాగుతోంది. తాము మహారాష్ట్రలో బీజేపీని  దిగువ నుండి ఉన్న‌త స్థాయికి తీసుకువెళ్ళామనీ, బాబ్రీ తర్వాత.. ఉత్తర భారతదేశంలో శివసేన వేవ్ పెరిగిందని, బీజేపీ అధికారం కోసం మాత్రమే హిందుత్వాన్ని ఉపయోగిస్తుందని,  తాము హిందూత్వను గెలిపించ‌డం కోసం బీజేపీతో క‌లిశామ‌ని, కానీ బీజేపీ మాత్రం త‌న గెలుపు కోసం హిందూత్వ‌ను వాడుకుంటున్న‌ద‌ని సంజయ్ రౌత్ ఆరోపించారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు నవాబ్ మాలిక్ మాట్లాడుతూ..  ఉద్ధవ్ ఠాక్రే 25 ఏళ్ల బిజెపి వ్యాఖ్యకు అనుకూలంగా మాట్లాడారు. బీజేపీని కట్టడి చేసిన పార్టీలు క్రమంగా నాశనమైపోయాయన్న మాట వాస్తవమేనని, తమ మతం గురించి గర్వపడటం మంచిదే కానీ, ఇతర మతాలకు మాత్రం సరికాదని అన్నారు.

శివ‌సేన‌ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే 96వ జయంతి సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ..  తాము బీజేపీకి మద్దతిచ్చామ‌నీ, 25 ఏళ్లపాటు పొత్తు పెట్టుకున్నామ‌నీ.. కానీ, అధికారం కోసం బీజేపీ హిందుత్వాన్ని ఉపయోగించుకుందనీ.. అందుకే బీజేపీని వదిలేశాం.. కానీ హిందుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం.. బీజేపీ హిందుత్వ పార్టీ కాదు..’’ అని అన్నారు. 

బీజేపీ అధికారం కోసం హిందుత్వాన్ని ఉపయోగించుకుంటుంద‌ని అన్నారు. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది.  శివసేన వాస్తవానికి బాల్ థాకరే సిద్ధాంతాన్ని అనుసరిస్తోందో?  లేదో ? ఆత్మపరిశీలన చేసుకోవాల‌ని బీజేపీ గుర్తు చేసింది. హిందుత్వంపై ఉపన్యాసాలు ఇచ్చే ముందు.. శివసేన,బాల్ ఠాక్రే సిద్ధాంతమా? కాదా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే పై  బీజేపీ నేత రామ్ కదమ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

click me!