ఇది అద్వానీ ఘనతే.. 24న అయోధ్యకు వెళ్తున్నా: శివసేన చీఫ్ ఉద్థవ్ థాక్రే

By Siva Kodati  |  First Published Nov 9, 2019, 5:52 PM IST

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రతిఒక్కరూ అంగీకరించి, గౌరవించాలని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. 


అయోధ్య రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సైతం పెదవి విప్పారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రతిఒక్కరూ అంగీకరించి, గౌరవించాలని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఈ నెల 24న అయోధ్యకు వెళ్తున్నానంటూ.. తన తండ్రి దివంగత బాల్ థాక్రే, వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్‌ను థాక్రే గుర్తుచేసుకున్నారు.

Latest Videos

undefined

బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీని కూడా త్వరలోనే కలుసి అభినందనలు తెలియజేస్తానని థాక్రే వెల్లడించారు. ఇదే సమయంలో అద్వానీ రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టిన విషయాన్ని ఉద్థవ్ థాక్రే గుర్తు చేసుకున్నారు. 

Also read:Ayodhya Verdict ఈ తీర్పు అద్వానీకి అంకితం: బీజేపీ నేత ఉమాభారతి

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

Also Read:అందరికీ ఆమోదమైందే:అయోధ్యపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది.

శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 
 

click me!