Ayodhya : సోషల్ మీడియాలో చర్చంతా ఆ తీర్ఫుపైనే.. గల్లంతైన మహా రాజకీయం

By sivanagaprasad Kodati  |  First Published Nov 9, 2019, 4:31 PM IST

అయోధ్య తీర్పుతో గత కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారి తీస్తోన్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంతో పాటు మరో కీలక ఘట్టమైన కర్తార్‌పూర్ కారిడార్‌లకు సోషల్ మీడియాలో ఎటువంటి స్థానం దక్కలేదు


అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. రోడ్డుపై ఏ నలుగురు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి సరే సరి.

శుక్రవారం రాత్రి నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో యువతతో పాటు మేధావులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు అయోధ్య తీర్పుతో గత కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారి తీస్తోన్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంతో పాటు మరో కీలక ఘట్టమైన కర్తార్‌పూర్ కారిడార్‌లకు సోషల్ మీడియాలో ఎటువంటి స్థానం దక్కలేదు.

Latest Videos

undefined

కాగా ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌ గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్ వద్ద భారత్‌వైపున ఉన్న కారిడార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన మోడీ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం కృషి చేసిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు పంజాబ్ ప్రభుత్వాన్ని అభినందించారు. అనంతరం డేరా బాబా నానక్‌ను సందర్శించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ని ప్రారంభించారు.

Also Read:వరల్డ్ టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict

మరోవైపు శనివారం మధ్యాహ్నం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict చోటు సంపాదించుకుంది. మధ్యాహ్నం 2.30 నాటికి ఈ హ్యాష్‌ట్యాగ్‌పై భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,50,000 ట్వీట్లు పోస్టయ్యాయి.

భారత్‌లో #BabriMasjid, #AyodhyaJudgement మరియు #RamJanmabhoomi హ్యాష్ ట్యాగ్లు బాగా ట్రెండవుతున్నాయి. అలాగే #supreme court కూడా ట్రెండ్స్‌లో స్థానం సంపాదించింది.

సర్వోన్నత న్యాయస్థానంపై 2,00,00 ట్వీట్లు షేరయ్యాయి. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగొయ్ #RanjanGogoi అన్న హ్యాష్ ట్యాగ్ కూడా నెటిజన్లు బాగా ఉపయోగించారు.

అయోధ్య తీర్పు దేశప్రజల మనోభావాలతో ముడిపడివున్న అంశం కావడంతో పాటు రెండు ప్రధాన మతాలు ముడిపడివుండటంతో నెటిజన్లు శాంతిని, సమానత్వాన్ని చూపారు. #hindumuslimbhaibhai హ్యాష్‌ట్యాగ్ ద్వారా తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు.

Also Read:Ayodhya verdict: జడ్జీలకు చీఫ్ జస్టిస్ గోగోయ్ విందు

హిందువులు, ముస్లింలు సోదరులేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తీర్పు గురించి తనకు అనవసరమని.. తాను సోదరభావాన్ని పంచుతానంటూ ఎక్కువ మంది ట్వీట్ చేశారు. 

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

click me!