పగకు దారితీసిన సెటిల్‌మెంట్: కాల్చి చంపి, కాళ్లను ముక్కలుగా నరికి

By Siva KodatiFirst Published Nov 19, 2019, 5:28 PM IST
Highlights

పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత దల్బీర్ సింగ్ దారుణహత్య ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది

పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత దల్బీర్ సింగ్ దారుణహత్య ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ కూలీ మనిషి విషయంలో ఘర్షణ తలెత్తడంతో పౌల్ట్రీ నిర్వాహకుడు బల్విందర్ సింగ్ అనే వ్యక్తి దల్బీర్ సింగ్ హత్యకు పథకం పన్నాడు.

దీనిలో భాగంగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బల్విందర్ సింగ్ అతని కుమారులు మేజర్ సింగ్, మన్‌దీప్ సింగ్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు దల్బీర్ ఇంట్లోకి చొరబడ్డారు.

ముందు అతని కుటుంబసభ్యులపై కాల్పులు జరిపి వాళ్లందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం దల్బీర్‌ను కాల్చి చంపి అక్కడితో ఆగకుండా అతని కాళ్లను ముక్కలు ముక్కలుగా నరికి పైశాచికంగా వ్యవహరించారు.

Also Read:మహిళ దారుణహత్య: ముక్కలు ముక్కలుగా నరికి.. తల, మొండెం వేరు చేసి

కూలీ మనిషి విషయంలో తలెత్తిన గొడవలో మాజీ సర్పంచ్ అయిన దల్బీర్ కలగజేసుకుని పరిష్కరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న బల్విందర్ మాత్రం దల్బీర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లుగా గ్రామస్తులు పేర్కొన్నారు. దల్బీర్ సింగ్ హత్య వార్తపై దుమారం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులపై కేసు నమోదు చేశారు. 

కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరులోని ఓ షాప్ ముందు మనిషి శరీర భాగాలు పడి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు సంచులతో పాటు ఓ హెల్మెట్‌లో మహిళ తలను  స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరు శ్రీమతి శెట్టి అని... ఆమె పండేశ్వర్‌లో ఓ ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తోందని, భర్త సుదీప్‌తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తోంది.

Also Read:పబ్‌జీ వద్దన్నందుకు: కన్నతండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకు

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శెట్టిని దారుణంగా హత మార్చారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల, మొండెం వేరు చేశారు. అక్కడితో ఆగకుండా శరీర భాగాలను రెండు సంచులలో కుక్కి మొండాన్ని నందిగూడలో, తలను నంటూర్ జాతీయ రహదారి సమీపంలో పడేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో శెట్టి భర్త ప్రమేమయం ఉందా అన్న కోణంలో ఆరా తీయగా.. అతను మొబైల్ చోరీ కేసులో ప్రస్తుతం మంగళూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. 

click me!