షిర్డీ సాయిబాబా దేవాలయానికి రూ.175 కోట్ల పన్ను మినహాయింపు..

Published : Nov 26, 2022, 10:18 AM ISTUpdated : Dec 01, 2022, 10:34 PM IST
షిర్డీ సాయిబాబా దేవాలయానికి రూ.175 కోట్ల పన్ను మినహాయింపు..

సారాంశం

ఆదాయపు పన్ను శాఖ శ్రీ సాయిబాబా సంస్థాన్‌ను మతపరమైన, ధార్మిక ట్రస్ట్‌గా అంగీకరిస్తూ విరాళాలపై విధించే పన్ను నుండి మినహాయింపు మంజూరు చేసింది.

పూణె : షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయ ట్రస్ట్‌కు భారీ పన్ను మినహాయింపు లభించింది. గత మూడేళ్లలో విధించిన రూ. 175 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి సాయిబాబా ఆలయ ట్రస్ట్‌కు మినహాయింపు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ మినహాయింపును మంజూరు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపింది. "2015-16 సంవత్సరానికి పన్నును అంచనా వేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖ శ్రీ సాయిబాబా సంస్థాన్ మతపరమైన ట్రస్ట్ కాదని, స్వచ్ఛంద ట్రస్ట్ అని భావించింది. ఈ మేరకు విరాళాల పెట్టెలో భక్తులు వేసిన విరాళాలపై 30 శాతం ఆదాయపు పన్ను విధించింది. దీని ప్రకారం పన్ను చెల్లింపును జారీ చేసింది. రూ.183 కోట్లకు నోటీసు ఇచ్చింది” అని పేర్కొంది.

దీంతో, ఆ తర్వాత ట్రస్ట్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది, సుప్రీంకోర్టు దీనిని పరిశీలించి..  "పన్ను నిర్ణయించే వరకు చెల్లించాల్సిన పన్నుపై స్టే విధించింది" అని పేర్కొంది. శ్రీ సాయిబాబా సంస్థాన్‌ను మతపరమైన, ధార్మిక ట్రస్ట్‌గా అంగీకరించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ చివరకు విరాళాల పెట్టెలో భక్తుు వేసిన విరాళంపై విధించిన పన్ను నుండి మినహాయింపును మంజూరు చేసింది. ఈ మేరకు శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు గత మూడేళ్లలో విధించిన రూ.175 కోట్ల ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభించిందని తెలిపింది. 

ప్రియుడు మాట్లాడడం లేదని విషం తాగుతూ సెల్ఫీ వీడియో.. చివరికి..

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu