కరోనా ఎఫెక్ట్: షిర్డీ ఆలయం మూసివేత

Published : Apr 05, 2021, 09:23 PM IST
కరోనా ఎఫెక్ట్: షిర్డీ ఆలయం మూసివేత

సారాంశం

కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో షీర్డీ సాయిబాబా ఆలయాన్ని ఇవాళ్టి నుండి మూసివేశారు. సోమవారం నాడు రాత్రి 8 గంటల నుండి ఆలయాన్ని మూసివేస్తున్నట్టుగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది.

ముంబై: కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో షీర్డీ సాయిబాబా ఆలయాన్ని ఇవాళ్టి నుండి మూసివేశారు. సోమవారం నాడు రాత్రి 8 గంటల నుండి ఆలయాన్ని మూసివేస్తున్నట్టుగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది.

సాయిబాబా ఆలయంతో పాటు ప్రసాదాలయ, భక్త నివాస్ ను కూడ మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఆలయంలో రోజువారీ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని సాయిబాబా సంస్థాన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసివేస్తామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.

దేశంలోని మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించారు.దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ఈ రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముంబైలో 9857  కేసులు సోమవారం నాడు రిపోర్టయ్యాయి.

ముంబైలో లోకల్ రైళ్లను నిలిపివేయాలనే ఆదేశాలను ఇవ్వలేదని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తోందని ఆయన చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం