కరోనా కలకలం: ఈ నెల 8న సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

Published : Apr 05, 2021, 08:19 PM IST
కరోనా కలకలం: ఈ నెల 8న సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

సారాంశం

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  ఈ నెల 8వ తేదీన రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించనున్నారు.


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  ఈ నెల 8వ తేదీన రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

దేశంలో కరోనా పరిస్థితులపై సీఎంలతో మోడీ చర్చించనున్నారు. కరోనా కేసులు, వ్యాక్సినేషనత్ తదితర అంశాలపై మోడీ చర్చిస్తారని పీఎంఓ ప్రకటించింది.కరోనా విషయమై ముఖ్యమంత్రులతో మోడీ చర్చించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రులతో మోడీ పలుదఫాలు సమావేశాలు నిర్వహించారు. 

ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ విషయమై సీఎంలతో ఆయన చర్చించారు. కరోనా విషయమై మోడీ ఉన్నతాధికారులతో ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.  టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ వేగవంతం చేయాలని పీఎం ఆదేశించారు.  కరోనా జాగ్రత్తలు, నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?