
కేరళ : keralaలో మరోసారి Shigella కేసు వెలుగుచూసింది. Kozhikodeలోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 27నే కేసు నమోదయ్యింది అని.. ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్ గా తేలినట్లు వివరించారు. బాలిక పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు. శరీరంలోకి షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి లక్షణాలు : జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు. కలుషిత నీరు, పాడైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువ. వ్యక్తిగత శుభ్రత పాటించడం, కాచిచల్లార్చిన నీటిని మాత్రమే తాగడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధికి దూరంగా ఉండొచ్చు.
ఇదిలా ఉండగా, కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇప్పటికే మన దేశంలో మూడు వేవ్‌లతో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన ఈ వేరియంట్ తాజాగా, మరింత ప్రమాదకరంగా ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది. థర్డ్ వేవ్ లో చూసిన వేరియంట్ కంటే కూడా పదిరెట్లు ప్రమాదకరమైన కొత్త వేరియంట్ బీహార్ లో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ ను బీఏ.12గా పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గుర్తించినట్టు వివరించారు. ఈ వేరియంట్ తొలిసారిగా అమెరికాలో వెలుగుచూసింది.
కరోనావైరస్ థర్డ్ వేవ్‌లో దేశంలో నమోదైన అధికంగా కేసులు బీఏ.2కు సంబంధించినవే. కానీ, ఇప్పుడు పాట్నాలో కనిపించిన వేరియంట్ బీఏ.12.. ఈ బీఏ.2కంటే పదిరెట్లు ప్రమాదకరమైనదిగా ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్, మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెచ్ వోడీ డాక్టర్ నమ్రతా కుమారి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి శాంపిళ్లను పంపిస్తున్నట్లు చెప్పారు. శాంపిళ్లను పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 13 శాంపిళ్లను పరీక్షించామని వివరించారు. అందులో కేవలం ఒకటే బీఏ.12 వేరియంట్ గా గుర్తించినట్టు తెలిపారు. మిగిలిన 12 శాంపిళ్లు బీఏ.2గా గుర్తించినట్టు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తాము ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ తేలినవారి కాంట్రాక్టులను వెంటనే ట్రేస్ చేయాలని అధికారులను కోరినట్టు ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వివరించారు. బీఏ.12 వేరియంట్ బీఏ.2 వేరియంట్ కంటే పదిరెట్లు ప్రమాదరకరమైనదని తెలిపారు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ వేరియంట్ రెండు మూడు కేసులు ఢిల్లీలోనూ వెలుగులోకి వచ్చాయి. తాజాగా, బిహార్‌లో రిపోర్ట్ అయింది. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కోవిడ్ పెరుగుతోంది.