
ఒరిస్సాలో గుట్టలు గుట్టలుగా గవ్వలు బయటపడ్డాయి. ఇంటి పునాదులు తవ్వుతుంటే బైటపడిన ఈ నిధిని చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఇది ఒరిస్సాలోని నయాగడ్ జిల్లా తరియా పంచాయతీలోని నిచ్చిపూర్ గ్రామంలో జరిగింది.
ఇక్కడ ఓ వ్యక్తి సొంతింటి నిర్మాణం కోసం పునాదులు తీసేందుకు తవ్వకాలు జరపగా, భూగర్భంలో నుంచి గంపలకొద్దీ గవ్వలు బైటపడ్డాయి. దాదాపు 10 తట్టల గవ్వలు ఇలా దొరికాయి. తవ్వినా కొద్ది వస్తున్న గవ్వల్ని చూసి యజమాని ఆశ్చర్యపోయాడు.
ఇప్పుడు ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. అయితే పూర్వకాలంలో గవ్వలు కూడా డబ్బులుగా వాడేవారని ప్రతీతి. దీనికి ఉదాహరణగానే ఇప్పుడు జరిగిన ఘటన చెప్పుకుంటున్నారు. డబ్బులు దాచే క్రమంలో భాగంగానే వీటినిలా గుప్తనిధులుగా దాచి పెట్టారని అంటున్నారు.
ఇక ఇంటి తవ్వకాల కోసం నాలుగు అడుగులు తవ్వగానే ఇవి బైటపడడం కూడా విచిత్రమే. దీంతో ఇది చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారు. దీని మీద స్థల యజమాని నారాయణ సాహు మాట్లాడుతూ పూర్వం ఆర్థిక లావాదేవీల్లో వీటిని ఉపయోగించేవారని చెప్పుకొచ్చాడు.