మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా... ఆంక్షలు మరింత కఠినతరం..

By AN TeluguFirst Published Feb 15, 2021, 1:08 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడం సంతోషకరమైన విషయం. అయితే ఇదే సమయంలో మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఐదో రోజూ కూడా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుద నమోదయ్యింది. అంతేకాదు దాదాపు నెల రోజుల తర్వాత కొత్త కేసులు మరోసారి నాలుగువేలకు పైగా నమోదయ్యాయి. 

ఆదివారం మహారాష్ట్ర వ్యాప్తంగా మరో 4, 092 కోవిడ్ కేసులు బయటపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసు సంఖ్య తాజాగా 20,64,278కి చేరింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 6న మహరాష్ట్రలో 4,382 కొత్త కేసులు నమోదయ్యాయి. 

ఆ తర్వాత మళ్లీ ఈ ఆదివారమే కేసుల సంఖ్య నాలుగువేలు దాటింది. ఒక్క ముంబైలోనే 645 వైరస్ కేసులు వెలుగుచూశాయి. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో ఇప్పటివరకు 3,14,076 మంది కోవిడ్ బారిన పడగా.. 11, 419 మంది మరణించారు. 

నిన్న మరో 1,355 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,75,603గా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 35,965 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో మరో 40 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 51,529మంది వైరస్ కు బలయ్యారు. 

రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మరో రాష్ట్రం కేరళ నుంచి మహారాష్ట్రకు వచ్చేవారికి ఆర్ టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది.

ఇక ఢిల్లీ, గోవా, గుజరాత్, రాజస్థాన్ ల నుంచి వచ్చేవారు కూడా తమ ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. 
 
click me!