ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 22 రోజుల పాటు పలుమార్లు అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి వ్యభిచారంలోకి..

By Asianet NewsFirst Published Aug 8, 2023, 11:08 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మహిళను బంధించి 22 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారంలోకి దించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను నమ్మించి 22 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 5వ తేదీన ఓ మహిళ హరిద్వార్ జిల్లా వీధుల్లో అనారోగ్యానికి గురై తిరుగుతూ పోలీసులకు కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను రక్షించి హాస్పిటల్ లో చేర్పించారు. కోలుకున్న తరువాత ఆమె చెప్పిన విషయాలు విని వారు షాక్ అయ్యారు. తనకు మత్తు మందు ఇచ్చి 22 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్ల మహిళలకు నదీమ్ అనే వ్యక్తి కొంత కాలం కిందట పరిచయం అయ్యాడు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి గత నెల 7వ తేదీన హరిద్వార్ కు తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను మహ్మద్ షకీబ్ అనే వ్యక్తికి పరిచయం చేశాడు. అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి, బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఇందులో అతడి భార్య ఆయేషా కూడా కీలకంగా వ్యవహరించింది. 22 రోజుల పాటు ఆమెను బంధించారు. 

అయితే దుండగుల బారి నుంచి తప్పించుకొని ఆమె ఇటీవల పోలీసుల కంట పడింది. ఆమె పరిస్థితి చూసి వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ నేపథ్యం గురించి పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం ఓ బృందాన్ని ఘజియాబాద్ కు పంపించారు. అక్కడి నుంచి బాధితురాలు భర్తను తీసుకొచ్చారు. అతడు ఆమెతో సున్నితంగా మాట్లాడి పలు వివరాలను సేకరించారు. అనంతరం మహ్మద్ షకీబ్, అతని భార్య ఆయేషాపై గంగ్న హర్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 328 (నేరం చేయాలనే ఉద్దేశంతో విషం ద్వారా గాయపరచడం), సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పోలీసులు అనైతిక ట్రాఫిక్ నిరోధక చట్టంలోని తగిన సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటనపై స్పందించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని డీజేపీని కోరింది. కాగా.. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించామని, మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ, రూరల్) ఎస్‌కె సింగ్ తెలిపారు. నిందితుడు మహ్మద్ షకీబ్ భార్య అయేషాను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

click me!