
ఆమె గతంలో మిస్ చైన్నై (miss chennai) విజేత. ఆమె పేరెంట్స్ వేరే దేశాల్లో ఉంటున్నారు. చైన్నై (chennai) లో ఓ మంచి ఇళ్లు కట్టుకోవాలని ఆమె భావించింది. అయితే దాని కోసం ఓ బిల్డర్ ను ఆశ్రయించారు. కానీ ఆమెను అతడు మోసం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంది. స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అయితే ఆ సమయంలో ఓ ఎస్ఐ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహానికి దారి తీసింది. దీంతో ఆమె తను సమస్యలన్నీ అతడితో పంచుకునేది. కానీ అతడు మాజీ మిస్ చైన్నైను వేరే దృష్టితో చూశాడు.
సమస్యలన్నీ అతడికి చెప్పడంతో ఇదే మంచి సమయం అని ఎస్సై భావించాడు. సమస్యలన్నీ పోవాలంటే ఇంట్లో పూజలు చేయాలని ఆమెకు సూచించాడు. కొందరు వ్యక్తుల్ని తీసుకొచ్చి పూజలు అంటూ హడావిడి చేశాడు. కొంత సమయం తరువాత మిస్ ఇండియాను ఓ రూంలోకి తీసుకెళ్లి బంధించాడు. ఇలా 40 రోజుల పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. కొన్ని రోజులు తరువాత ఆమె ఎలాగో తప్పించుకుంది. పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు, పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. తమిళనాడు (thamilnadu)లోని పళ్లికరణై (pallikaranai) ప్రాంతానికి చెందిన ఓ యువతి గతంతో ఓ సారి మిస్ చైన్నై పోటీల్లో విజేతగా నిలిచారు. అయితే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చైన్నైలో ఉండరు. వారు విదేశంలో ఉంటుండగా.. మిస్ ఇండియా ఒక్కరే ఇక్కడ ఉంటారు. అయితే తనకు ఈస్ట్ కోస్ట్ రోడ్డు (east cost road)లో ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకొని అక్కడ నివసించాలని అనుకున్నారు. అయితే ఆమె సొంతంగా ఇళ్లు కట్టుకోకుండా బిల్డర్ (builder) ను సంప్రదించింది. కానీ అతడు ఆమెను మోసం చేశాడు.
ఆ బిల్డర్ మోసం చేయడంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు దగ్గర్లోని పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఉన్న ఎస్ఎస్ఐ (ssi) ఆండ్రు కార్వెల్ (andru karvel)తో మాజీ మిస్ ఇండియాకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ స్నేహంగా ఉండేవారు. అయితే అతడిని స్నేహితుడిగా భావించి మిస్ ఇండియా తనకున్న సమస్యలన్నీ చెప్పింది. ఆ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంట్లో కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, అవి చేసే వారు తనకు తెలుసని చెప్పాడు. అవన్నీ నమ్మిన ఆమె దానికి ఒప్పుకొంది. కొందరు మనుషులను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నట్టు ఆమెను నమ్మించాడు. ఇంట్లో హడావిడి సృష్టించాడు. అదను చూసి ఆమెను ఓ రూమ్ కు తీసుకెళ్లి బంధించాడు. ఇలా 40 రోజుల పాటు అందులోనే ఉంచాడు. ఆ సమయంలో తాను చిత్రహింసలు అనుభవించానని, అతడు లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని యువతి ఫిర్యాదులో తెలిపింది. కొందరు సాయంతో ఆ రూమ్ నుంచి తప్పించుకొని వచ్చానని ఆమె పేర్కొంది. అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పళ్లికరణై పోలీసులు (pallikaranai police)విచారణ జరుపుతున్నారు.