కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి రంగం సిద్దమా..? హస్తిన టూర్ సక్సెస్ అయ్యేనా..?

Published : Aug 09, 2023, 07:24 PM IST
కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి రంగం సిద్దమా..? హస్తిన టూర్ సక్సెస్ అయ్యేనా..?

సారాంశం

వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో (Congress) విలీనంపై ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. అతి త్వరలో విలీనం కానున్నదనే చర్చ సాగుతోంది. ఢిల్లీ  పెద్దలతో వైఎస్ షర్మిల భేటీ కాబోతున్నారా? మరో రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలను కలువనున్నట్టు తెలుస్తోంది. 

వైఎస్సార్టీపీని (YSRTP) కాంగ్రెస్‌లో(Congress) మరోసారి విలీనం కానున్నదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అతి త్వరలో ఢిల్లీ పెద్దల సమక్షంలో విలీనం కానున్నదనే చర్చ సాగుతోంది. బెంగుళూర్ కేంద్రంగా చర్చలు జరుగుతున్నట్టు, తర్వలో ఢిల్లీ పెద్దలతో వైఎస్ షర్మిల భేటీ కాబోతునట్టు తెలుస్తోంది.

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) గతవారం రోజులుగా బెంగళూరులోనే ఉంటున్నారు. విశ్వసనీయ వర్గాల  సమాచారం ప్రకారం..  వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందేకు కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో (DK ShivaKumar) చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బెంగుళూర్ పెద్దలతో  భేటీ అయిన వైఎస్సార్టీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ నేత్రుత్వంలో ఢిల్లీ పెద్దలను కలువనున్న సమాచారం. ఈ క్రమంలో షర్మిల రెండు రోజుల పాటు హస్తినలోనే ఉంటారని, ఈ పర్యటనలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరితో భేటీ అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవబోతున్నారనీ, హస్తీన పర్యటన భేటీ వరుస భేటీలు ఇవన్నీ రెండు మూడ్రోజుల్లో జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే.. ప్రస్తుతం ఎలాంటి షరతులు లేకుండానే షర్మిల పార్టీని విలీనం చేసుకోబోతున్నారనీ, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఆమెకు ప్రాధాన్యత ఇస్తామనే హామీతో చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే.. షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడంతో పాటు..మరికొన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.

కాంగ్రెస్ ప్రణాళిక ఇదేనా.? 

తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల రాకతో కాంగ్రెస్ నేతలకు ఓ ఇంతా ఒత్తిడి పెరిగింది. మరోవైపు.. షర్మిల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో షర్మిల పార్టీని  విలీనం చేసుకుని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు కట్టబెట్టాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, షర్మిల మాత్రం ఆంధ్రప్రదేశ్ కి వెళ్లే ప్రసక్తే లేదని, ఏపీ సీఎం జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం తనకు ఇష్టపడలేదని తెలిపినట్టు తెలుస్తోంది.

తాను తెలంగాణలోనే ఉంటానని తెలిపినట్టు సమాచారం. ఈ షరతులను ఒప్పుకుంటేనే తాను కాంగ్రెస్ వైపుకు అడుగులేస్తున్ననని షర్మిల కరాఖండిగా చెప్పేయబోతున్నారని తెలుస్తోంది. ఫైనల్ గా ఈ  అంశాలపై ఏకాభిప్రాయం వస్తేనే విలీనం జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా.. విలీనంపై వార్తలు వస్తున్నా షర్మిల ఖండిస్తూనే ఉన్నా.. తాజా పరిణామాలు మాత్రం.. విలీనం ఖచ్చితంగా జరుగున్నట్టు తెలుస్తోంది.   

విలీనానికి అవే సాక్ష్యమా..?

షర్మిల పార్టీ విలీనం జరుగన్నదనే ప్రచారం కావడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల రాహుల్ గాంధీ పుట్టిన రోజు నాడు, రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం పునురుద్ధరణ జరిగిన వేళ షర్మిల ట్వీట్ చేయడం కూడా .. ఈ ప్రచారాన్ని ఊతమిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యి.. చర్చులు ఫలిస్తే.. మరో వారం రాజుల్లో విలీనం కానున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజమెంత ఉందో మరో రెండు రోజుల్లో తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?