Maharashtra crisis: ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం ప‌త‌నం.. శ‌ర‌ద్ ప‌వార్ జోస్యం

Published : Jul 04, 2022, 04:15 AM IST
Maharashtra crisis: ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం ప‌త‌నం.. శ‌ర‌ద్ ప‌వార్ జోస్యం

సారాంశం

 Maharashtra crisis: ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని, షిండే ఏర్పాటు చేసిన ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోవచ్చని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Maharashtra crisis: ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని, షిండే ఏర్పాటు చేసిన ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోవచ్చని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  వచ్చే ఆరు నెలల్లో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పాటు చేసిన‌  ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంద‌నీ, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో మీడియాతో మ‌ట్లాడారు. 
 
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, కాబట్టి మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పవార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం సంతోషంగా లేరని పవార్ అన్నారు. ఒక్కసారి మంత్రివర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే..  వారి అస‌మ్మ‌తి బయటపడుతుందని, ఇది చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని ఆయన అన్నారు.

ఈ ప్రయోగం విఫలమైతే చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీలోకి తిరిగి వస్తారని కూడా పవార్ సూచించారు. మన చేతిలో కేవలం ఆరు నెలల సమయం ఉంటే, ఎన్‌సిపి శాసనసభ్యులు వారి వారి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ సమయం గడపాలని ఆయన అన్నారు.  శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేయగా, సీనియర్ బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ షిండే డిప్యూటీగా ప్రమాణం చేశారు. 
 
షిండే నేతృత్వంలోని దాదాపు 40 మంది సేన ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, దీని ఫలితంగా బుధవారం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం కూలిపోయింది.

PREV
click me!

Recommended Stories

52 KM Concrete Road in 6 Days: 6 రోజుల్లో 52 కిలోమీటర్లు రెండు గిన్నీస్ రికార్డులు| Asianet Telugu
DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!