Leena Manimekalai's Kaali: వివాదాస్ప‌ద పోస్ట‌ర్ .. కాళీమాత ఓ చేతిలో సిగరెట్, మ‌రో చేతిలో ఎల్‌జీబీటీ జెండా..

Published : Jul 04, 2022, 02:59 AM IST
Leena Manimekalai's Kaali: వివాదాస్ప‌ద పోస్ట‌ర్ .. కాళీమాత ఓ చేతిలో సిగరెట్, మ‌రో చేతిలో ఎల్‌జీబీటీ జెండా..

సారాంశం

Leena Manimekalai's Kaali: ప్రముఖ ఫిల్మ్ మేకర్ లేనా మణిమేకలై వివాదాల్లో చిక్కుకుంది. ఆమె ఇటీవ‌ల రూపొందించిన కాళీ అనే డాక్యుమెంట‌రీ కోసం కాళీ మాత ఫోటోనూ అస‌భ్య‌క‌రంగా రూపొందించింది. దీంతో నెట్టింట్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

Leena Manimekalai's Kaali: ప్రముఖ ఫిల్మ్ మేకర్ లేనా మణిమేకలై వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్ని చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. హిందూవులమనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ.. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ పోస్టర్లో ఏముంది. ఆమెపై నెటిజన్లు అంతగా మండి పడటానికి కారణమేంటీ? |

వివరాల్లోకెళ్తే.. ఇటీవల  మూవీ మేకర్ లీనా మణిమేకలై.. కాళి అనే డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే.. ఆ డాక్యుమెంట్ కోసం డిజైన్ చేయించిన.. పోస్టర్  వివాదాస్పదంగా మారింది. ఆ వివాదాస్పద పోస్టర్‌లో మాతా కాళి సిగరెట్ తాగుతున్నట్లు చూపబడింది. ఇది మాత్రమే కాదు, కాళీ మాత మ‌రో చేతిలో LGBT జెండాను కూడా చూపించారు. ఈ పోస్టర్ విడుద‌ల చేసిన‌ వెంటనే.. వైర‌ల్ గా మారింది. ఈ పోస్ట‌ర్ పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నుండి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మణిమేకలై పోస్టర్‌తో ఏం రాశారు?

మణిమేకలై వివాదాస్ప‌ద పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఇలా రాశారు. "రిథమ్ ఆఫ్ కెనడాలో భాగంగా నా ఇటీవలి చిత్రాన్ని ఆగాఖాన్ స్టేడియంలో ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాను. నేను ఈ ప్రదర్శన డాక్యుమెంటరీని CERC ఇన్ మైగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ కో-హార్ట్ ఎక్సైటెడ్‌గా నా సిబ్బందితో రూపొందించాను."అని రాసుకొచ్చారు. 

సోషల్ మీడియాలో మూవీ మేక‌ర్ పై ఆగ్ర‌హం

ఈ పోస్టర్‌పై సోషల్ మీడియా వినియోగదారులు వ్యాఖ్యానిస్తూ.. "ప్రతిరోజూ హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షిస్తోందా" అని రాశారు. ఇంకో నెటిజ‌న్ హోం మంత్రి అమిత్ షా, హోం మంత్రిత్వ శాఖ, పిఎం కార్యాలయం, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేసి.. "దయచేసి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలి" అని రాశారు.

ఒక నెటిజ‌న్ ఇలా వ్రాశారు. "సిగ్గుపడండి, కాళి మాత రూపాన్ని వివాదాస్ప‌దంగా రూపొందించినందుకు. ఈ దుశ్చర్యకు పాల్ప‌డిన వారిని తీవ్రంగా శిక్షించండి. ఈ దుశ్చర్యకు ఏ నాటికీ క్షమించబడదు. అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "ఇది మ‌త‌ విశ్వాసానికి అవమానం. దయచేసి శాంతిభద్రతలను కాపాడండి.  భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A ప్రకారం తగిన చర్య తీసుకోండి. ఈ హ్యాండిల్‌ను నిషేధించండి, లేకపోతే అది భారతదేశంలో అశాంతిని సృష్టిస్తుంది."అని మ‌రో నెటిజ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. "సిగ్గులేకుండా దేవతను అవమానిస్తున్న ఈ సిగ్గులేని మహిళ.. కోట్లాది సనాతన మహిళలకు స్ఫూర్తి. మీరు ఆమె విగ్రహాన్ని అవమానిస్తున్నారు అని మండి ప‌డ్డారు.

లీనా మణిమేకలై ఎవరు?

లీనా మణిమేకలై ఓ చిత్రనిర్మాత, కవయిత్రి, నటి, ఆమె ఇప్పటి వరకు డజనుకు పైగా డాక్యుమెంటరీ లను రూపొందించింది. ఫిల్మ్ మేకర్ కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆమె త‌న మొదటి డాక్యుమెంటరీని 'మహాత్మా అనే పేరుతో  2003లో విడుద‌ల చేసింది. ఇందులో తమిళనాడులోని అరక్కోణం సమీపంలోని మగట్టుచేరి గ్రామంలోని అరుంధతియార్ కమ్యూనిటీలో ప్రబలంగా ఉన్న దేవతకు కుమార్తెలను అంకితం చేసే పద్ధతిని చిత్రించాడు. ఆమె తన డాక్యుమెంటరీల ద్వారా దళిత మహిళలపై హింస వంటి అంశాలను కూడా హైలైట్ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు