‘నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను’..  ప్రాణ స్నేహితుడి చితిపై దూకి ఆత్మహుతి

Published : May 29, 2023, 06:12 AM IST
‘నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను’..  ప్రాణ స్నేహితుడి చితిపై దూకి ఆత్మహుతి

సారాంశం

అనారోగ్యంతో స్నేహితుడి చనిపోతే మరో స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియలు నిర్వహించి అందరూ ఇంటికి వెళ్లిపోతుండగా ఆ స్నేహితుడు మాత్రం అక్కడే ఉండి, చితిలో దూకాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

‘‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా.. నీ గుండెలో పూచేటిది.. నీ శ్వాసగ నిలిచేటిది.. ఈ స్నేహమొకటేనురా’’ ఈ పాట వింటుంటే.. ఈ లోకంలో స్నేహాన్ని మించిన బంధం మరొకటి లేదని పిలుస్తుంది. మన ప్రాణ స్నేహితుల కోసం ఏదైనా చేయాలని పిలుస్తుంది. నిజమే.. అదే స్నేహానికి ఉన్న గొప్పతనం. కానీ, ఓ వ్యక్తి తన ప్రాణ  స్నేహితుడు కోసం ఎవరూ చేయాలనే పని చేశారు.  అనారోగ్యంతో స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక స్నేహితుడి చితిలో దూకాడు. తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లా నాగ్లా ఖంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే అశోక్ (42), ఆనంద్(40) ప్రాణస్నేహితులు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు. కలిసే పెరిగారు. ఒకరంటే మరొకరికి ప్రాణం. ఒకరిని విడిచి మరొకరు అసలు ఉండలేకపోయారు. అయితే కొంత కాలం కిందట అశోక్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు పరీక్షించగా..క్యాన్సర్  అని తేలింది. ఆ రోగం నయం కావడానికి చాలానే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. కానీ, పరిస్థితి విషమించడంతో అతడు శనివారం ఉదయం మరణించాడు. 

అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానికంగా ఉన్న యమునా తీరంలో అశోక్ అంత్యక్రియలు నిర్వహించారు. చితి వెలిగించిన అనంతరం గ్రామస్థులు తిరిగి వెళ్లగా ఆనంద్ మాత్రం స్నేహితుడి మృతిని అతడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో అనంద్ ఒక్కసారిగా తన స్నేహితుడి చితిలో దూకాడు. యమునా నదిలో స్నానం చేస్తున్న యువకులు అతడిని ఎలాగోల చితిలోంచి బయటకు తీశారు.

తీవ్ర గాయాలవడంతో వెంటనే జిల్లా హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఆగ్రా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. కానీ అక్కడికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పరిస్థితి విషమించడంతో ఆనంద్ ప్రాణాలు కోల్పోయారు. అశోక్ మృతదేహానికి కూడా సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. స్నేహితుడి మరణాన్ని గౌరవ్ తట్టుకోలేకపోయాడని రూరల్ ఎస్పీ రణవిజయ్ సింగ్ తెలిపారు. ఒక రోజు ఇద్దరు స్నేహితులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu