Maharashtra: శరద్ పవార్ మరో గూగ్లీ.. మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు విందు ఆహ్వానం

By Mahesh K  |  First Published Feb 29, 2024, 8:56 PM IST

శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను విందుకు ఆహ్వానించినట్టు శరద్ పవార్ తెలిపారు.
 


ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో మరో గూగ్లీ వేశారు. శరద్ పవార్ నిర్ణయాలు చాలా సార్లు రాజకీయ విమర్శకలకు అందకుండా ఉంటాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇలాగే ఉన్నది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను ఆయన విందుకు ఆహ్వానించారు.

మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన, కాంగ్రెస్ పార్టీల కూటమి మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చారు. అజిత్ పవార్ కూడా శరద్ పవార్‌ను కాదని బీజేపీ ప్రభుత్వంలో చేరారు. ఆ తర్వాత ఎన్సీపీ కూడా అనివార్యంగా చీలిపోయింది. మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం స్థానంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. ఇప్పుడు ఈ ముగ్గురినీ శరద్ పవార్ విందుకు ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

Latest Videos

Also Read: రాహుల్ గాంధీ పోటీ తెలంగాణ నుంచే.. ప్రధాని అవుతారు: మంత్రి పొంగులేటి

సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కోసం బారామతికి వస్తున్నారు. ఇది శరద్ పవార్ సొంత పట్టణం. శరద్ పవార్ సొంత పట్టణం బారామతికి శనివారం వీరు రావడంతో ఆయన స్పందించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్‌నాథ్ షిండే బారామతికి తొలిసారి వస్తున్నారని శరద్ పవార్ అన్నారు. ఇక్కడ మహా రోజ్‌గార్ పథకం ప్రారంభిస్తుండటం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తన క్యాబినెట్ సహచరులతో కలిసి ఇంట్లో విందుకు రావాలని ఆహ్వానించినట్టు శరద్ పవార్ వివరించారు.

click me!