విజయం దిశగా టీఎంసీ....మమతకు శరద్‌ పవార్‌ అభినందనలు

Arun Kumar P   | Asianet News
Published : May 02, 2021, 02:27 PM ISTUpdated : May 02, 2021, 02:34 PM IST
విజయం దిశగా టీఎంసీ....మమతకు శరద్‌ పవార్‌ అభినందనలు

సారాంశం

మరోసారి టిఎంసి అధికారం దిశగా దూసుకువెళుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ అభినందనలు తెలిపారు. 

కలకత్తా: పశ్చిమబెంగాల్ మరోసారి త్రుణ‌మూల్ కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే  సీఎం మమతా బెనర్జీకి ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం మనం చేసే  కృషి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని శరత్ పవర్ అన్నారు.   

కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్ అభ్యర్థుల ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. 

read more  నెగ్గిన పంతం: బీజేపీపై తొడగొట్టి గెల్చిన ప్రశాంత్ కిషోర్

ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. 

మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. 

ఇక ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేసారు. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !