నెగ్గిన పంతం: బీజేపీపై తొడగొట్టి గెల్చిన ప్రశాంత్ కిషోర్

By team teluguFirst Published May 2, 2021, 2:07 PM IST
Highlights

మొత్తం బీజేపీ ఎన్నికల మెషినరీ అంతా ఒకవైపు అండర్ డాగ్ గా వీల్ చైర్ లో కూర్చున్న మమతా మరోవైపు. ఆమె విజయం వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తం అధికంగా ఉంది.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ని బట్టి గనుక చూస్తే తమిళనాడులో డీఎంకే, కేరళలో లెఫ్ట్, బెంగాల్ లో మమత, అస్సాం లో బీజేపీ, పుదుచ్చేరిలో కూడా బీజేపీ కూటమి విజయం సాధించేబోతున్నాయని అర్థమవుతుంది. 

ఈ ఎన్నికల ఫలితాల్లో తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో డీఎంకే, టీఎంసీ దూసుకుపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేని గద్దె దింపి డంక్ పీఠం ఎక్కబోతుండగా... బెంగాల్ లో మమతా హాట్ ట్రిక్ సాధించబోతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒక కామన్ పాయింట్ ఏమిటంటే ఆయా పార్టీల ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించడమే. 

తమిళనాడులో డీఎంకే అధికారం సాధిస్తుందని అందరూ చెప్పినప్పటికీ... బెంగాల్ లో మాత్రం పోరు చాలా టఫ్ గా ఉండబోతుందని అంతా ఊహించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్నీ ప్రకటించాయి. కానీ అనూహ్యంగా మమతా బెనర్జీ 2016లో ఎన్ని సీట్లనైతే సాధించిందో మళ్ళీ అదే స్థాయిలో సీట్లను సాధించబోతున్నట్టుగా ట్రెండ్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది. 

అమిత్ షా, నడ్డా రోజు అక్కడికి వెళ్తే ప్రతి రెండు రోజులకొకసారి ప్రధాని నరేంద్ర మోడీ బెంగాల్ లో పర్యటించారు. కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున బహిరంగసభలు నిర్వహించి ఈ కోవిద్ కాలంలో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. బెంగాల్ లో ఆఖరి దశ ఎన్నికలను కలిపి ఒకేసారి పెట్టాలని మమత కోరినప్పటికీ... ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. 

మొత్తం బీజేపీ ఎన్నికల మెషినరీ అంతా ఒకవైపు అండర్ డాగ్ గా వీల్ చైర్ లో కూర్చున్న మమతా మరోవైపు. ఆమె విజయం వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తం అధికంగా ఉంది. ఆయన ఎన్నికను ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్ గా మర్చి బీజేపీ ఉత్తరాంధ్ర పార్టీ, బెంగాలీ అస్మిత ను స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. సీఎం పేస్ లేకపోవడం కూడా బీజేపీకి మైనస్ అయ్యింది. 

ఎంతసేపటికి కూడా మమతా స్థానిక విషయాల మీద, సమస్యల మీదే మాట్లాడారు తప్ప జాతీయ విషయాల జోలికి వెళ్ళలేదు. ఎన్నికను రాష్ట్రానికే పరిమితం చేసి ఉంచరు. బెంగాల్ సమస్యలు, బెంగాల్ గొప్పతనం అంటూ బెంగాల్ చుట్టూనే రాజకీయ ప్రచారాన్ని నడిపారు తప్ప వేరే ఏ విషయాన్ని కూడా తెర మీదకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. 

ఆయన ఎన్నికలకు ముందు బీజేపీ 100 సీట్లకు చేరుకోలేదు అని సవాల్ విసిరాడు. అన్నట్టుగానే బీజేపీ 100 లోపే చాప చుట్టేసేలా కనబడుతుంది. గతంలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, అప్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, 2014లో మోడీలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. అటు తమిళనాడులో కూడా స్టాలిన్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతుడయ్యాడు. 

click me!