కరోనాతో కాదు.. లస్సీ తాగి 115 మందికి అస్వస్థత.. !

Published : May 02, 2021, 01:55 PM IST
కరోనాతో కాదు.. లస్సీ తాగి 115 మందికి అస్వస్థత.. !

సారాంశం

కరోనాతో దేశమంతా కల్లోల పరిస్థితుల్లో ఉంటే ఒడిశాలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో బహిరంగ ప్రదేశాల్లో తినడం, తాగడం చాలావరకు తగ్గించారు. కానీ వారికి ఆ విషయం పట్టలేదు. అదే వారి పాలిట ప్రాణాంతకంగా మారింది.

కరోనాతో దేశమంతా కల్లోల పరిస్థితుల్లో ఉంటే ఒడిశాలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో బహిరంగ ప్రదేశాల్లో తినడం, తాగడం చాలావరకు తగ్గించారు. కానీ వారికి ఆ విషయం పట్టలేదు. అదే వారి పాలిట ప్రాణాంతకంగా మారింది. 

వివరాల్లోకి వెడితే.. వారాంతపు సంతలో లస్సీ తాగిన 115 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా పోడియా మండలం కుర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 21 మంది చిన్నారులు ఉన్నారు. 

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్తి గ్రామంలో శుక్రవారం జరిగిన వారపు సంతలో ఓ దుకాణం లో గ్రామస్తులు లస్సీ తాగారు. వీళ్లందరూ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విషయం తెలిసి పొడియా ఆరోగ్య కేంద్రం సిబ్బంది గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించారు.

కొందరిని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరికొందరికి ఇంట్లోనే చికిత్స చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా గ్రామస్తులు అస్వస్థతకు గురైనట్టు పొడియా వైద్యాధికారి శ్రీనివాస్ మాఝి శనివారం న్యూస్ డేకు తెలిపారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం