షాహీన్ బాగ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Feb 6, 2020, 12:22 PM IST
Highlights

సిఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న షాహిన్ బాగ్ ఆందోళనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత షాహిన్ బాగ్ ను మరో జలియన్ వాలా బాగ్ గా మార్చవచ్చునని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: షాహీన్ బాగ్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడదు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకు) వ్యతిరేకంగా 50 రోజులుగా షాహిన్ బాగ్ లో జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం బల ప్రయోగానికి దిగవచ్చునని ఆయన అన్నారు. 

ఆందోళన చేస్తున్న నిరసనకారులను బుల్లెట్లతో కాల్చి షాహిన్ బాగ్ ను మరో జలియన్ వాలా బాగ్ గా మార్చే ప్రమాదం ఉందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2024 వరకు ఎన్నార్సీని అమలు చేయబోమని స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు 

See Video: షాహిన్ బాగ్ కాల్పులు : కపిల్ గుజ్జార్ ఆప్ కార్యకర్తే... డిసిపి రాజేష్

జాతీయ జనాభా నమోదు కోసం కేంద్రం రూ.3,900 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు. తాను చరిత్ర విద్యార్థిని కాబట్టి హిట్లర్ సమయంలో మాదిరిగానే రెండు సార్లు జనాభా గణన చేయాలనుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు.

ఎవరు రాడికలైజ్ చేస్తున్నారనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత షాహిన్ బాగ్ లో ప్రభుత్వం బలప్రయోగం చేయవచ్చుననే వార్తల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఆ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: షహీన్ బాగ్ షూటర్... ఆప్ కార్యకర్తే : ఢిల్లీ పోలీసులు

ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులు, ఢిల్లీ పోలీసులు షాహిన్ బాగ్ లో తనిఖీలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని నిరసనకారులను ప్రోత్సహించారని అసదుద్దీన్ చెప్పారు. 

షాహిన్ బాగ్ లోని ఐదు పోలింగ్ స్టేషన్లను క్లిష్టమైనవిగా గుర్తించారు. షాహిన్ బాగ్, ఖురేజీ ఖాస్, హౌజ్ రాని ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

click me!